జాతీయ వార్తలు

ముస్లింలకు చోటుండదని కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18:అన్ని మతాలు, మత విశ్వాసాల సమ్మిళిత భావనే హిందూ రాష్టమ్రని అని, దేశంలో ముస్లింలకు స్థానం ఉండదన్నది దీని అర్థం కాదని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. విశ్వజనీన సౌభ్రాతృత్వ లక్ష్యంతోనే ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తోందని, భిన్నత్వంలో ఏకత్వమే దాని ఆశయమని తెలిపారు. హిందుత్వ సంస్కృతి నుంచే ఈ ఆలోచన పుట్టుకొచ్చిందని అందుకే దీన్ని తాము హిందూ రాష్ట్రంగా పేర్కొంటున్నామని చెప్పారు. అందరినీ ఆక్కున చేర్చుకుని ముందుకెళ్లడమే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమని స్పష్టం చేశారు. భారత సాంస్కృతిక విలువల సారాంశమే హిందుత్వమని పేర్కొన్న ఆయన, అన్ని మతాలు, భావనలు, ఆలోచనలను అక్కున చేర్చుకోవడమే దీని ఆశయమన్నారు. మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్ సదస్సులో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు.