జాతీయ వార్తలు

గోవాలో బలపరీక్ష పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: బీజేపీ సారథ్యంలోని గోవా ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి పారికర్ అస్వస్తత కారణంగా రాష్ట్రంలో పాలనాపరమైన సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ముందుకొచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం గవర్నర్ మృదుల సిన్హాను కలుసుకుని తమ వాదన వినిపించారు. ప్రభుత్వ బలపరీక్షకు వీలుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మూడు నాలుగు రోజుల్లో ఈ అంశాన్ని పరిశీలిస్తానని గవర్నర్ తమకు హామీ ఇచ్చారని కాంగ్రెస్ నాయకుడు చంద్రకాంత్ కవ్లేకర్ మీడియాకు తెలిపారు. 40మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో పారికర్ ప్రభుత్వానికి మెజార్టీ లేదని..కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తమకు ఉందని గవర్నర్‌కు నివేదించామని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీని రద్దు చేయడానికి వీల్లేదని తాము గవర్నర్‌కు స్పష్టం చేశామన్నారు. ‘ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోలేక పోతే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి బలపరీక్ష నిర్వహించాలి’ అని కాంగ్రెస్ నేత ఉద్ఘాటించారు. గోవా ఫార్వార్డ్ పార్టీ. మహారాష్టవ్రాది గోమంతక్ పార్టీ,ఎన్‌సిపి, పలువురు ఇండిపెండెంట్‌ల మద్దతుతో రాష్ట్రంలో బీజీపీ అధికారంలో ఉ న్న విషయం తెలిసిందే. కాగా, గోవాలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్‌లో కనిపిస్తోందని, అందుకు ఆ పార్టీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయడమే నిదర్శనమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.