జాతీయ వార్తలు

చిరు వ్యాపారుల చట్టం సక్రమ అమలుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: వీధుల్లోని చిరు వ్యాపారులు, రోడ్లెంబడి తిరుగుతూ వస్తువులు తదితరాలు విక్రయించి జీవించే పేదవారి కోసం నిర్ధేశించిన చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులతో సమీక్షించేందుకు ఓ వర్క్‌షాపును నిర్వహించాలని నిర్ణయింనట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ‘ప్రొటెక్షన్ ఆఫ్ లైలీ హుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్’ ( ఉపాధి సంరక్షణ, వీధి వ్యాపారాల నియంత్రణ) చట్టం 2014లో ఏర్పాటైంది. వీధుల్లో చిరువ్యాపారాలు చేసే వారిని ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాలకు తరలించాలని, ఆ వ్యాపారుల హక్కులకు ఇది భంగం కలిగించరాదని చట్టం సూచిస్తోంది. ఈక్రమంలో మంగళవారం జరిగిన జాతీయ స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ సదస్సులో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ కార్యకలాపాల మంత్రి పూరీ మాట్లాడుతూ రానున్న మూడు నెలల్లో నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో చట్టం అమలును పటిష్టవంతం చేసే విషయంపై చర్చించడం జరుగుతుందని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో పట్టణ వ్యాపార కమిటీ (టౌన్ వెండింగ్ కమిటీ)లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, తద్వారా వ్యాపారుల హక్కుల రక్షణకు కృషి చేయడంతో పాటు, పర్మనెంట్ వ్యాపార జోన్లు ఏర్పాటు చేయడానికి వీలుకలుగుతుందని మంత్రి చెప్పారు. ఇప్పటికే కమిటీలను ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలా ప్రత్యేక వ్యాపార జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా పట్టణాభివృద్థి ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుకలుగుతుందన్నారు. అలాగే చిరు వ్యాపారులను అసంఘటిత రంగానికి చెందిన వారిగా కాకుండా సంఘటిత రంగానికి చెందిన వారుగా మార్చాలన్న లక్ష్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉందని సమావేశానంతరం మంత్రి పూరీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.