జాతీయ వార్తలు

సైన్యాన్ని కుదించే యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: భారత దేశ సైనిక పరిమాణాన్ని తగ్గించాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.అయితే, సైనిక సంఖ్యను తగ్గించాలని, దాన్ని శక్తివంతమైన వ్యవస్థగా మార్చాలంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ సిపార్సు చేసిందని, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఉన్నత కమాండర్లతో దీనిపై చర్చిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికైతే సైనిక దళాల సంఖ్యను తగ్గించాలన్న ప్రతిపదన తన ముందైతే లేదని సీతారామన్ ఉద్ఘాటించారు. సైన్యాన్ని శక్తివంతంగా తీర్చేందుకు వీలుగా దళాల సంఖ్యను రానున్న ఐదేళ్ల కాలంలో లక్షకు పైగా తగ్గించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు కథనాలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం ఈ అంశంపై రక్షణ మంత్రి మాట్లాడారు. సైనిక దళాల సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయిలో పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లెఫ్టినెంట్ జనరల్ డిబి షెక్తార్ సారథ్యంలోని కమిటీ పలు సూచనలు చేసిందని తెలిపారు. సైనిక దళాల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇస్తామంటూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నామన్నారు. కాగా, రెండురోజుల పాటు ఇక్కడ జరిగిన సదస్సులో సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే సైనిక దళాల ఆధునీకరించాల్సిన అవసరంపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం భారత సైన్యంలో పదమూడు లక్షల మంది సైనికులు ఉన్నారు. ఎప్పుడైతే సైనిక దళాల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా కథనాలు వెలువడ్డాయో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్వరంతో విరుచుకు పడింది.