జాతీయ వార్తలు

సారీ చెప్పేదిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 14:బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ చేసిన రేప్ వ్యాఖ్యలపై వ్యక్తిగతంగా హాజరై క్షమాపణలు చెప్పాలని మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లను బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ బేఖాతరు చేశాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పనని అతడు తెలిపాడు. సల్మాన్ షూటింగ్ సంగతులు ఆన్‌లైన్ ఇంటర్‌వ్యూ ఇచ్చిన ఖాన్ ‘అత్యాచారానికి గురైన మహిళ పరిస్థితి షూటింగ్ అయ్యాక తాను ఎదుర్కొన్నాను’అన్నాడు. సల్మాన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మహిళలను అవమానించే రీతిలో మాట్లాడిన అతడు క్షమాపణ చెప్పాలని పలు సంస్థలు డిమాండ్ చేశాయి. దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్ సల్మాన్‌ఖాన్‌కు రెండు సార్లు సమన్లు ఇచ్చింది. వ్యక్తిగతం కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. రెండోసారి ఇచ్చిన సమన్లను ఖాన్ తిరస్కరించాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోనని సల్మాన్‌ఖాన్ కమిషన్‌కే లేఖ రాశాడు. తనను క్షమాపణలు అడిగే హక్కు కమిషన్‌కు లేదని అతడు వాదించాడు. ఇలా ఉండగా ఖాన్ లేఖ తమకు అందిందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహక్తర్ వెల్లడించారు. న్యాయనిపుణులతో సంప్రదించిన తరువాత ముందుకెళ్తామని ఆమె అన్నారు.