జాతీయ వార్తలు

నా హైకమాండ్ మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: తన నియోజక వర్గం ప్రజలే తనకు హైకమాండ్ అని, వారే తన మాస్టర్లని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజక వర్గంలో దాదాపు 550 కోట్ల రూపాయల ఖర్చయ్యే ప్రాజెక్టులకు మంగళవారం ఇక్కడ శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన మోదీ ఈ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా తాను చేపట్టిన పనులను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వారణాసి పరిస్థితి దేవుడి దయ అన్నట్టుగా ఉండేదని, ఈ నాలుగేళ్లలో తాను వారణాసి భౌగోళిక స్వరూపంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చానని చెప్పారు. ‘దేశ ప్రధానిగా మీరు నాకు బాధ్యతలు అప్పగించారు. కానీ వారణాసి ఎంపీగా నేను చేసిందేమిటో చెప్పాల్సిన అవసరం నాపై ఎంతో ఉంది’అని ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మోదీ అన్నారు. ‘మీరే నా మాస్టర్..మీరే నా హైకమాండ్ కాబట్టి ఎంపీగా నేను చేసిన పనులను వివరించాల్సిన బాధ్యత కూడా నాపై ఎంతో ఉంది’అని మోదీ పేర్కొన్నారు. అనాధిగా వస్తున్న కాశీ పట్టణ ప్రాచీన, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షిస్తూనే అవసరానుగుణంగా పరివర్తన తీసుకురావాలన్నదే తన ఆశయమన్నారు. నాలుగేళ్ల క్రితం వారణాసిలో మార్పులు తీసుకురావాలని ఇక్కడి ప్రజలు భావించారని, ఆ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ప్రజల హర్షధ్వానాల మధ్య హరహర మహదేవ్ అంటూ మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టిన మోదీ దాదాపు నలభై నిముషాల పాటు మాట్లాడారు. విశ్వనాధుడు, గంగాదేవీ ఆశీస్సులతో ఎంపీగా తాను మరో ఏడాదిని మొదలెట్టడం తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని అన్నారు. ఒకప్పుడు వేలాడుతున్న కరెంట్ వైర్లు సహా గందరగోళ పరిస్థితుల్లో ఉండేదని, ఇప్పుడు అన్ని చోట్లా ఎల్‌ఇడి లైట్లు తారసిస్తున్నాయని తెలిపారు. తూర్పు భారతానికి ముఖద్వారంగా వారణాసిని మార్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేపడుతున్నామని, ప్రపంచ స్థాయి వౌలిక సదుపాయాలను కల్పించేందుకూ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోందని తెలిపారు.

చిత్రం..కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని నరేంద్రమోదీ