జాతీయ వార్తలు

అంగన్‌వాడీల వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. గతంలో అంగన్‌వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ.3,000 ఉండగా రూ.4,500కు పెంచారు. అలాగే ఏడబ్ల్యూసీ అంగన్‌వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ.2,250 ఉండగా రూ.3,500కు పెంచారు. అంగన్‌వాడి సహాయకులకు ఇచ్చే రూ.1,500ను రూ.2,500కు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడి సహాయకుల నెలవారీ పనితీరును బట్టి అదనంగా మరో రూ.250 ఇవ్వనున్నారు. ఇంటిగ్రేటేడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) పథకం కింద ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు రూ.10,649 కోట్లను కేటాయించారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం మూలంగా దేశంలోని దాదాపు 27 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు లబ్ధిపొందుతారు. పెంచిన గౌరవ వేతనాల 1, అక్టోబరు 2018 నుంచి అమలులోకి రానున్నాయి. మరోవైపు ఆశ బెనిఫిట్ ప్యాకేజీకి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఆశ వర్కర్లకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1000 ప్రోత్సాకాన్ని రూ.2000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, సురక్షా యోజనల కింద ఆశ కార్యకర్తలకు బీమాను కల్పిస్తారు. ఇది వచ్చే అక్టోబరు నుంచి అమలులోకి రానుంది.

చిత్రం..అంగన్‌వాడీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ, చిత్రంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా సంజయ్‌గాంధీ