జాతీయ వార్తలు

కేరళ కార్మికురాలికి లాటరీలో రూ. కోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూలై 14: అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో ఎవరూ చెప్పలేం. కేరళలో ఓ మహిళలకు అలాంటి అనుభవం ఎదురైంది. రబ్బర్ ప్లాంట్‌లో పనిచేసే మహిళకు కోటి రూపాల లాటరీ తగిలింది. ‘స్ర్తిశక్తి’పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాటరీ నబీసాకు తగిలింది. లాటరీలో కోటి రూపాయలు వచ్చాయని తెలుసుకున్న నబీసా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, వికలాంగురాలైన చెల్లెలను పోషించుకోవడానికి ఆసరా దొరికిందని నబీసా చెబుతోంది. కిలిమనూర్‌కు చెందిన ఆమెకు లాటరీ టికెట్లు కొనే అలావాటు ఉంది. గతంలోనూ ఐదువేలు, వెయ్యి రూపాయల ప్రైజులు తగిలాయి. ఈ సారి కోటి రూపాయల రావడంతో తన కష్టాలన్నీ తీరిపోతాయని అంటోంది. వచ్చిన మొత్తంతో చిన్న ఇల్లు కట్టుకుని, వికలాంగురాలైన సోదరితో కిరాణాషాపుపెట్టిస్తానని నబీసా వెల్లడించింది. ఆర్థికంగా వెనకబడిన మహిళలకు చేయూత నివ్వాలన్న ఉద్దేశంతో గత యుడిఎఫ్ ప్రభుత్వం స్ర్తిశక్తి పేరుతో లాటరీని ప్రారంభించింది. టికెట్ ధరను 40 నుంచి 50 రూపాయలు నిర్ణయించింది. వారం వారం తీసే లాటరీ 11వ డ్రాలో నబీసాకు కోటి రూపాయలు వచ్చాయి.