జాతీయ వార్తలు

అమృతా దేవి బిష్ణోయ్‌సహా అమర వీరులకు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో అమృతా దేవి బిష్ణోయ్‌సహా అమర వీరులకు నివాళులర్పిస్తున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు. ప్రచారంలో ఉన్న గాథల ప్రకారం, క్రీస్తు శకం 1730లో జోధ్‌పూర్ మహారాజా ఒక భారీ రాజమందిరాన్ని కట్టించాలని నిర్ణయించాడు. అనువైన స్థలంలో ఉన్న చెట్లను కొట్టేయాలని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. అయితే, ఆ ప్రాంతంలోని 3ఖేజ్రీ2 వృక్షాలను కాపాడేందుకు అమృతా దేవిసహా 363 మంది ప్రయత్నించారు. వారంతా చెట్లను కౌగలించుకొని, కదలకుండా ఉండిపోవడంతో, ఊచకోత కోయాల్సిందిగా రాజు ఆజ్ఞాపించాడు. ఫలితంగా చెట్ల కోసం వారు ప్రణాలను కోల్పోవాల్సి వచ్చింది. నాటి ఆత్మత్యాగానికి గుర్తుగా, సంఘటన చోటు చేసుకున్న జోధ్‌పూర్‌లోని ఖేజార్లీ గ్రామంలో సంస్మరణ సభను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.