జాతీయ వార్తలు

రామమందిరాన్ని త్వరగా నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: అయోధ్యలో రామమందిరాన్ని త్వరగా నిర్మించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇక్కడ జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ మూడు రోజుల సమావేశాలలో చివరి రోజు బుధవారం ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘రామ మందిరాన్ని త్వరగా నిర్మించాలి’ అని అన్నారు. ఈ అంశంపై జరుగుతున్న చర్చలను కూడా ఆయన సమర్థించారు. అయితే, తుది నిర్ణయం రామమందిర్ సమితిపైనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనే ప్రచారానికి, ఉద్యమానికి రామ మందిర్ సమితి నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాను ప్రభుత్వంలో భాగస్వామిని కాదని, అందువల్ల రామ మందిర నిర్మాణం కోసం ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకు రాగలుగుతుందా? లేదా? అనే విషయం తనకు తెలియదని భగవత్ అన్నారు. రామ మందిరం కోసం ఆర్డినెన్స్‌ను జారీ చేయగలిగితే, అందుకు న్యాయ పరంగా ఎదురయ్యే సవాళ్లను కూడా పరిశీలించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.