జాతీయ వార్తలు

కోలుకుంటున్న కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 14: దాదాపు వారం రోజులుగా హింసాకాండతో అట్టుడికిన జమ్మూ, కాశ్మీర్‌లో క్రమంగా సాదారణ పరిస్తితులు నెలకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో ఎక్కడ కూడాపెద్దగా అల్లర్లు లేదా హింసాకాండ జరగలేదు. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలులో ఉండడంతో వరసగా ఆరోరోజు కూడా సాధారణ జనజీవనానికి అటంకం ఏర్పడింది. ఇదిలా ఉండగా అల్లర్లలో గాయపడిన మరో యువకుడు గురువారం ఆస్పత్రిలో మృతి చెందడంతో గత శుక్రవారం హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వనీ హత్య తర్వాత చెలరేగిన హింసాకాండలో మృతి చెందిన వారి సంఖ్య 36కు చేరుకుంది. అక్కడక్కడా రాళ్లు రువ్వడం లాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ రాష్ట్రంలో ఏ ప్రాంతంనుంచి కూడా పెద్దగా హింసాకాండకు సంబంధించిన సంఘటనలు జరిగినట్లు వార్తలు రాలేదని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కాగా, హింసాత్మక నిరసనలను ఎదుర్కోవడానికి కొత్త మార్గాలను అనే్వషిస్తున్న పోలీసులు నిఘా అవసరాల కోసం అత్యాధునిక కెమెరాలతో కూడిన పైలట్ రహిత డ్రోన్‌లను రంగంలోకి దించాలని యోచిస్తోంది. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ ప్రాంతంలో గస్తీ కోసం గురువారం కొద్ది సేపు అలాంటి డ్రోన్‌ను ఉపయోగించారు. అయిదు రోజుల క్రితం కుల్గాం జిల్లా తులి నూర్‌పోరా గ్రామంలో తన ఇంటిముందు నిలబడి ఉండగా భద్రతా దళాలు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల ఇర్ఫాన్ అహ్మద్ దార్ ఎస్‌కెఐఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయాడని అధికారులు చెప్పా రు. కాగా, పుల్వామా జిల్లా అవంతిపోరాలో స్థానికులు జీలం నదిలోంచి ఒక యువకుడి మృత దేహాన్ని వెలికి తీశారని అధికారులు చెప్పారు.

చిత్రం.. శ్రీనగర్‌లో గురువారం పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు