జాతీయ వార్తలు

ప్రజల మనోభావాలదే అంతిమ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ప్రజల మనోభావాలదే విజయం అవుతుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ ఉద్యమం సాంస్కృతిక విజయమే అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ అయోధ్యపై రెండు హిందీ పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ‘దేశ స్వాతంత్రోద్యమం తర్వాత జరిగిన అతిపెద్ద ఉద్యమం రామజన్మభూమి ఆందోళనే’నని అభివర్ణించారు. ఈ ఉద్యమం సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలనూ సమ్మిళితం చేసిందని పేర్కొన్నారు.ఆరు శతాబ్దాల క్రితం అయోధ్యలో రామాలయాన్ని ధ్వంసం చేసినప్పటి నుంచీ ప్రజా ఉద్యమం కొనసాగుతూనే ఉందని, సాంస్కృతిక విజయం సాధించేవరకూ ఇది ఆగదని అమిత్‌షా అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలదే అంతిమ విజయం అవుతుంది కాబట్టి ఈ ఉద్యమమూ ఆ దిశగానే సాగుతుందని భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్ అధినేత భగవత్ శ్రీరాముడి జన్మస్థలంగా భావిస్తున్న అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాన్ని ప్రస్తావించారు. నిజాన్ని, న్యాయాన్ని విస్మరించి అసత్యాలను, అన్యాయాన్ని సమర్థిస్తే అది హింసకే దారితీస్తుందని ఆయన అన్నారు. శతాబ్దాలుగా ఈ ప్రాంతంతో ముడివడిన ప్రజల భక్త్భివాలను నిర్లక్ష్యం చేయడం కూడా సమస్యలకు ఆహ్వానం పలుకడమే అవుతుందన్నా రు. సాధ్యమైనంత త్వరలోనే రామాలయ నిర్మాణం జరగాలని పునరుద్ఘాటించిన భగవత్ ‘సమాజానికి సత్వరమే న్యాయం జరగాల్సిన అవసరం ఉంది’అని అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ అయోధ్యలో గొప్పగా రామాలయాన్ని నిర్మించేందుకు అన్ని మతాల ప్రజలు చేతులు కలిపితే ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. ‘అయోధ్యకా చష్‌మదీద్’, ‘యుద్ధ్‌మే అయోధ్య’అనే ఈ రెండు పుస్తకాలను ప్రముఖ పాత్రికేయుడు హేమంత్ శర్మ రాశారు.

చిత్రం..అయోధ్యపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్