జాతీయ వార్తలు

కేంద్ర ఉద్యోగులకు ఎల్టీసీ ద్వారా విమానయానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, అండమాన్, నికోబార్ ద్వీపాలకు ఎల్‌టీసీ (లీవ్ ట్రావెలె కనె్సషన్) కింద విమానయానం చేసే సౌకర్యాన్ని మరో రెండు సంవత్సరాలు అనగా సెప్టెంబర్ 2020 వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌకర్యం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమకు ఇష్టం వచ్చిన చోటకు ప్రయాణించవచ్చు. పెయిడ్ లీవుతో సహా దానిని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ సౌకర్యంలో ఉద్యోగులు ఏ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ద్వారానైనా ప్రయాణం చేయవచ్చునని కేంద్ర పర్సనల్ మినిస్ట్రీ వర్గాలు తెలియజేశాయి. కాగా అప్పటిదాకా ఉన్న నిబంధనలను సడలిస్తూ ఎల్‌టీసీ కింద ఉద్యోగులు ఈశాన్య ప్రాంతాలు, జమ్మూ, కాశ్మీర్ అండమాన్ నికోబార్ ద్వీపాలకు సైతం ప్రయాణం చేయవచ్చునని కేంద్రం 2014లో ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి రెండేళ్లకొకసారి ఈ అనుమతులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 25తో గడువు ముగుస్తుండటంతో మరో రెండేళ్ల పొడిగింపు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 48.41 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. కాగా, ఎల్టీసీ సౌకర్యాన్ని ఎట్టి పరిస్థితుతుల్లో దుర్వినియోగం చేయరాదని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ సౌకర్యం కింద సాధ్యమైనంత తక్కువ ధరకు విమానటికెట్లు లభించేలా ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. ఈ సౌకర్యం కింద ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని సంబంధిత శాఖల అధికారులు ఉద్యోగులకు తెలియజేయాలని, ఎల్టీసీ కింద వారు సమర్పించిన టికెట్లను కొన్ని ఆయా విమానయాన సంస్థలకు పరిశీలన నిమిత్తం పంపి నిర్ధారణ చేసుకోవాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది.