జాతీయ వార్తలు

క్షిపణి ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలసోర్ (ఒడిసా), సెప్టెంబర్ 20: అంతరిక్షం నుంచి అంతరిక్షంలోని లక్ష్యాలను ఛేదించే అత్యంత శక్తివంతమైన షార్టు రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఇక్కడి నుంచి ప్రయోగాత్మకంగా పంపి పరిశీలించారు. ఒడిసాలోని చాందిపూర్‌లోని లాంచ్‌పాడ్ -3 నుంచి గురువారం మధ్యాహ్నం 1.35 గంటలకు దీనిని అంతరిక్షంలోకి పంపి పరీక్షించారు. డిఆర్‌డిఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణిలో అంతర్గనేవిగేషన్ సిస్టమ్‌తో పాటు పలు ఫీచర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి ప్రయోగం నేపథ్యంలో చందాపూర్ పరిసరాల్లోని 2 కిలోమీటర్ల పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.