జాతీయ వార్తలు

ఎన్నికలప్పుడే రామ మందిర నిర్మాణ జపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆర్‌ఎస్‌ఎస్‌కు రామమందిర నిర్మాణం గుర్తుకు వస్తుందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాల్సిందేనంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గురువారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి మాట్లాడుతూ ఒక సంస్థది గాని, ఒక వ్యక్తిది గాని డిఎన్‌ఏలో మార్పు ఉండదని విమర్శించారు. హిందూ, ముస్లింల మధ్య ఉన్న స్పర్థలు పోవాలంటే రామమందిర నిర్మాణమే శరణ్యమంటూ బుధవారం ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాల సందర్భంగా భగవత్ పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘ఎన్నికలు వస్తున్నాయి.. ఇప్పుడు వారికి రామమందిర ని ర్మాణం అంశం గుర్తుకు వస్తుంది’ అన్నారు. రామమందిర నిర్మాణంపై 1986-2018 మధ్య ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకత్వాలు చేసిన ప్రకటనలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 370, రామమందిర నిర్మాణంపై మాత్రం ఆర్‌ఎస్‌ఎస్ భావాలు మారవని, అదే 377 ఆర్టికల్‌పై మాత్రం భిన్నంగా ఉంటుందని అన్నారు. సమాజంలో అందరూ సమానమేనని, అందరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే హక్కు ఉందని పేర్కొన్న ఆర్‌ఎస్‌ఎస్ గే, హోమోసెక్స్‌వల్స్ అయిన ఎల్‌జిబిటి వర్గంపై ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు.