జాతీయ వార్తలు

డ్రైవింగ్ లైసెన్సుల జారీకి త్వరలో ఏకీకృత వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఏకీకృత వ్యవస్థ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేసేందుకు డేటాబేస్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్సులను బహుళ వ్యవస్థల ద్వారా జారీ చేసే విధానం వల్ల ఒక వ్యక్తి అనేక రకాల లైసెన్సులను పొందుతున్నారన్నారు. భారత్‌లో 22లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు. నైపుణ్యం ఉన్న మాననవనరుల అభివృద్దికి చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్ రహిత కార్లను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అవకతవకలను నిరోధించేందుకు డేటా బేస్ వ్యవస్థను సమగ్ర విధానంతో రూపొందిస్తున్నామన్నారు. భారత్‌లో డ్రైవింగ్ లైసెన్సులు పొందడం సులభమని చెప్పారు. ఒక వ్యక్తి వివిధ రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్సులను పొందుతున్నారన్నారు. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎడాపె డా లైసెన్సులు ఇష్టానుసారం జారీ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. సాలీనా 1.5 లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వాహనంలో తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్‌లను అమర్చాలనే నిబంధన చేర్చుతున్నట్లు చెప్పారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో కూడా సంస్కరణలు తేనున్నట్లు చెప్పారు. జాతీయరహదారుల పొడువును పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. లక్షలాది మంది డ్రైవర్లు ప్రతి రోజూ విధులకు హాజరవుతున్నారని, అందులో 400 మంది ఇంటికి చేరుకోకపోవడం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది అకాలమరణాలకు గురవుతున్నాయని, దీని వల్ల కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయన్నారు. డ్రైవ్ స్మార్ట్, డ్రైవ్ సేఫ్ అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన స్వచ్చందసేవా సంఘాలను కోరారు.