జాతీయ వార్తలు

ఎన్‌డిఏది అధికార దాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాందేడ్, జూలై 14: మోదీ ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలుస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో ఉత్తరాఖండ్‌లో సైతం హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో సైతం సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ మోదీ ప్రభుత్వంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వం అధికార దాహంతో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో న్యాయబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవ పరిచింది’ అని కాంగ్రెస్ పార్టీ బుధవారం మహారాష్టల్రోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ సోనియా అన్నారు. మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు సుప్రీంకోర్టును చూసి మనమంతా ఎంతో గర్వించాలని కాంగ్రెస్ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి శంకర్ రావు చవాన్ విగ్రహాన్ని, ఆయన పేరిట ఏర్పాటు చేసిన స్మారక లైబ్రరీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ సోనియా అన్నారు. చవాన్ గనుక బతికి ఉంటే, ఇదంతా చూసి ఎంతో బాధపడి ఉండేవారని, ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను తప్పకుండా వ్యతిరేకించి ఉండేవారని కూడా ఆమె అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం.. నాందేడ్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్