జాతీయ వార్తలు

విదేశాంగ మంత్రుల భేటీకి ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి మేరకు రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు న్యూయార్క్‌లో సమావేశం జరిపేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం అంగీకరించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ సమావేశం అవుతారు తప్ప చర్చలు జరిపే అవకాశం లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీష్‌కుమార్ స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రుల సమావేశం ఎజెండా ఇంకా ఖరారు కాలేదు.. రెండు దేశాల రాయబార కార్యాలయాల సీనియర్ అధికారులు పరస్పర సంప్రదింపుల ద్వారా ఎజెండాను ఖరారు చేస్తారని ఆయన గురువారం విలేఖరులకు తెలిపారు. ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌తో చర్చలు జరపటం అసాధ్యమని, తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆయన ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వెంటనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమైతే బాగుంటుందని సూచించారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనను ఎన్‌డీఏ ప్రభుత్వం అంగీకరించిందని రావీష్‌కుమార్ చెప్పారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే వాతావరణం లేనందున పాకిస్తాన్‌లో సార్క్ దేశాల మండలి సమావేశం నిర్వహించేందుకు తాము అంగీకరించటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం విషయంలో భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఉగ్ర దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపటం తమకు ఎంతమాత్రం సమ్మతం కాదన్నారు. ఇమ్రాన్ ఖాన్ కోరిక మేరకు రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు ఆమెరికాలోని న్యూ యార్క్ నగరంలో జరగవలసి ఉన్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భేటీ అవుతారని తెలిపారు. చర్చలద్వా రా అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చని అంటున్న పాకిస్తాన్ మరోవైపు మన సైనికులపై దాడులు చేస్తోంది. నిన్నకూడా ఒక సైనికుడిని నిర్దాక్షిణ్యంగా చంపేసిందని ఒక విలేఖరి తెలపగా ఉగ్రవాదానికి సంబంధించి భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. సీమాంతర ఉగ్రవాద దాడులు కొనసాగినంత కాలం పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని రావీష్‌కుమార్ స్ప ష్టం చేశారు. సమావేశానికి చర్చలకు మధ్య ఎంతో తేడా ఉంటుందనేది మరిచిపోరాదని అన్నారు. పాకిస్తాన్‌లో సార్క్ శిఖరాగ్ర సమావేశం జరిగేందుకు అనువైన వాతారణం లేదని ఆయన స్పష్టం చేశారు. రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు న్యూయార్క్‌లో ఎప్పుడు, ఎలా సమావేశం కావాలనేది నిర్ణయించిన అనంతరం ఈ సమావేశంలో ఏ చర్చించాలనేది నిర్ణయిస్తారని రావీష్‌కుమార్ వివరించారు. విదేశాంగ మంత్రుల సమావేశానికి ఒప్పుకున్నాం తప్ప సమావేశంలో ఏం చర్చించాలనేది ఇంకా నిర్ణయించలేదని రావీష్‌కుమార్ చెప్పారు. పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి విజ్ఞప్తి మేరకు జరుగుతున్న ఈ సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో న్యూయార్క్‌లో జరిగే సార్క్ దేశాల విదేశీ మంత్రుల సమావేశానికి భారత్ కూడా హాజరవుతుందని ఆయన తెలిపారు. సరిహద్దు భద్రతా దళం సైనికుడిని పాక్ రేంజర్లు హత్య చేయటం అమానుషం.. బీఎస్‌పీ అధికారులు పాకిస్తాన్ అధికారులతో ఈ అంశంపై మాట్లాడుతున్నారని రావీష్‌కుమార్ చెప్పారు.