జాతీయ వార్తలు

బంగ్లా వలస వాసులు చెదపురుగుల్లాంటి వారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 22: బంగ్లాదేశ్ నుంచి మనదేశానికి వలస వచ్చిన వారు చెదపురుగుల్లాంటి వారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించివేస్తామని ఆయన స్పష్టం చేశారు. అస్సాంలో ఇటీవల విడుదల చేసిన జాతీయ పౌర రిజిస్ట్రేషన్ డ్రాఫ్టును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆ జాబితాలో సుమారు 40 లక్షల మంది అక్రమంగా మనదేశానికి వలస వచ్చినవారుగా గుర్తించడం జరిగిందన్నారు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను సవివరంగా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుందని షా చెప్పారు. అక్రమ వలసదారులందరినీ దేశం నుంచి వెళ్లగొట్టే చర్యలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. వచ్చే యేడాది చివరిలో ఈ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్‌కు దీటుగా వ్యూహ రచన చేసి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు అమిత్ షా ఇక్కడకు వచ్చారు. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం దుర్బేద్యమైనదని ఆయన వ్యాఖ్యానించారు. లంకకు రాయభారం వెళ్లిన అంగదుని పాదాన్ని సైతం రావణుడు కదపలేక పోయారని, ఇక్కడి బీజేపీ ప్రభుత్వం సైతం అలాంటి శక్తియుక్తులు కలిగినదేనని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్న రాహుల్ ఆయన కుటుంబం నాలుగు తరాలుగా ఈ దేశానికి ఏమి వెలగబెట్టిందో తెలపాలని ప్రజలు కోరుతున్నారని షా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్ ఒక రోగిస్టు రాష్ట్రంలా మారిందని, దాన్ని వసుధర రాజే ముఖ్యమంత్రి అయ్యాక చికిత్సచేసి ఆరోగ్య, ఐశ్యర్యప్రదం చేస్తున్నారు.