జాతీయ వార్తలు

మీడియాను సంఘటితం చేయడం వీలవుతుందా? : ప్రకాశ్‌రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్న ప్రస్తుత తరుణంలో ఈ రంగాన్ని ఎలా సంఘటితం చేయాలన్న ఆలోచన తనను వేధిస్తోందని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ‘జర్నలిస్టులపై దాడులకు ప్రతిఘటన’ అనే అంశంపై శనివారం నాడిక్కడ జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను పలుమార్లు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడినపుడు అవి పత్రికల్లో ప్రచురింతం కాలేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అసలు పత్రికా రంగం మొత్తం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. మరొకరిని ఇంతగా ఎందుకు ద్వేషిస్తారో అర్థం కాదన్నారు. జర్నలిస్టులు ధైర్యంగా ఈ విషయంలో అధికారులను నిలదీయాలని తరచూ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించే ప్రకాష్‌రాజ్ సూచించారు. దేశ్‌బంధు ఎడిటర్ ఇన్ చీఫ్, సీనియర్ పాత్రికేయుడు లలిత్ సూర్జన్ మాట్లాడుతూ జర్నలిస్టుల మధ్య ఐక్యత ఉండాలని సూచించారు. గతంలోప్రభుత్వాలను సైతం మార్చ గలిగే శక్తి కలిగివున్న పాత్రికేయులు ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల్లో పత్రికా రంగంపై విశ్వాసం సన్నిగిల్లే స్థితి ఏర్పడిందని, కొత్తగా వచ్చి న కొన్ని పత్రికా యాజమాన్యాలు సైతం ఇందుకు దోహదం చేస్తున్నాయని, అందుకే పాత్రికేయులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెయిడ్ న్యూస్‌ను సంస్కృతిని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. బయటి వ్యక్తులెవరో పత్రికను ప్రభావితం చేసే పరిస్థితులు రావడం శోచనీయమన్నారు. జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ, జర్నలిస్టు రక్షణ కమిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో కునాల్ ముజుమ్‌దార్ అనే కరస్పాండెంట్ ప్రసంగిస్తూ ప్రపంచంలో హత్యకు గురైన 88 శాతం జర్నలిస్టులు స్థానిక విలేఖరులేనని, ప్రత్యేకించి రాజకీయ బీటు విలేఖరులకు ప్రాణసంకటంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు.