జాతీయ వార్తలు

వచ్చే యేదాది ‘జర్నీస్’ పుస్తకం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ప్రఖ్యాత కవి, జానపద సాహితీవేత్త, పరిశోధకుడు ఏకే రామానుజన్ రచనలెన్నో ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇందులో ఆయన మరికొన్ని రచనలను వెలుగులోకి తెచ్చే సరికొత్త పుస్తకం వచ్చే యేడాది ఆవిష్కృతం కానుంది. ‘జర్నీస్’ పేరిట విడుదల కానున్న ఈ పుస్తకాన్ని రామానుజన్ కుమారుడు కృష్ట రామానుజన్, గిల్లెర్మో రోడ్రిగ్జ్ సంయుక్తంగా రచిస్తున్నారు. రామానుజన్ వ్యక్తిగత డైరీలు, జర్నల్స్ నుంచి స్వీకరించిన అంశాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నారు. రామానుజన్ సాహితీ ప్రయాణంలో ఆయన ఆలోచనలు, కలలను ఇందులో వివరిస్తారు. 1923-1993 మధ్య కాలంలో రామానుజన్ పురాతన తమి ళ, కన్నడ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. యూఆర్ అనంతమూర్తి నవల ‘సంస్కార’ను సైతం అనువదించారు. ఆయన జీవిత కాలంలో ఆంగ్లంలో నాలుగు కవితా సంకలనాలను ఆవిష్కరించారు. దశాబ్ధాల తరబడి ఆయన చేసిన సాహితీ పరిశోధనలన్నింటికీ పుస్తక రూపం ఇవ్వాలని భావించారు. ఆయన మృతిచెందిన 25ఏళ్ల అనంతరం ఆయన జర్నల్స్, డైరీలు, పరిశోధనా వ్యాసాలు, సుమారు 50 యేళ్ల కాలానికి సంబంధించిన విలువైన డాక్యుమెంట్లన్నింటినీ ఆయన కుటుంబం చికాగో విశ్వవిద్యాలయం రీజన్‌స్టైన్ గ్రంథాలయంలోని ప్రత్యేక సేకరణల విభాగం రీసెర్చి సెంటర్‌కు 1994లో అప్పగించింది. ఈ క్రమంలో సరికొత్త పుస్తకం విడుదలకు మార్గం సుగమమైంది. ఈ పుస్తకాన్ని వచ్చే యేడాది పెంగ్విన్ రాండమ్ హౌస్ అనే సంస్థ విడుదల చేయనుంది. ఈ సంస్థకు చెందిన భారతీయ విభాగం అసోసియేట్ పబ్లిషర్ రంజనాసేన్ గుప్తా మాట్లాడుతూ ఈ పుస్తకం విడుదలను గర్వంగా భావిస్తున్నామన్నారు.