జాతీయ వార్తలు

మా పాత్ర లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్ల ఒప్పందంలో ఫ్రాన్స్‌కు చెందిన దాసల్ట్ ఏవియేషన్, భారత్‌లోని రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేయడానికి సంబంధించి కేంద్రప్రభుత్వం పాత్ర లేదని రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ విషయమై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ ప్రకటన వివాదస్పదం కావడంతో రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. రాఫెల్స్ ఫైటర్ జెట్స్‌పై అనవసర వివాదాలు, మీడియా కథనాలు వెలువడుతున్నాయన్నారు. దాసెల్ట్ సంస్థనే రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందని, ఇందులో భారత ప్రభుత్వ ప్రమేయం ఉండదన్నారు. దాసల్ట్ ఏవియేషన్, రిలయన్స్ డిఫెన్స్ ఉమ్మడిగా ఇప్పటికే ప్రకటన చేశాయి. ఏరోస్పేస్ విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలను ఈ రెండు సంస్థలు నెలకొల్పుతాయన్నారు. ఈ ఒప్పందంతో భారత్ ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. హోలాండ్ చేసిన ప్రకటనను పూర్తిగా చదివి ఒక నిర్ణయానికి రావాలని రక్షణ మంత్రిత్వ శాఖ రావాలన్నారు. మాజీ అధ్యక్షుడి ప్రకటనపై ఘర్షణాత్మక ధోరణిలో కథనాలువెలువరించాయన్నారు. ఆర్‌డీఎల్, దాసల్ట్ ఏవియేషన్ మధ్య ఒప్పందం పూర్తిగా వాణిజ్యాత్మకమైనదన్నారు. ఈ సంయుక్త ఒప్పందం 2017 ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చిందన్నారు. పెట్టుబడులు, టెక్నాలజీ బదలాయింపు ఈ ఒప్పందంలోని అంశాలని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. రక్షణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం, విదేశీ ఒరిజనల్ పరికరాల తయారీ సంస్థకు భారత్‌లో తమకు ఇష్టమైన, నమ్మకమైన సంస్థను ఎంపిక చేసుకునే అర్హత, యోగ్యత ఉంటుందని, ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. విదేశీ రక్షణ పరికరాల సంస్థలు మొత్తం కాంట్రాక్టు విలువలో 30 శాతం మేర భారత్‌లో పెట్టుబడులు పెట్టి విడిభాగాలను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. తన భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఆ విదేశీ రక్షణ సంస్థకు ఉంటుందన్నారు.