జాతీయ వార్తలు

ఎవరి మాట వారిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్ల వివాదం కొత్తమలుపుతిరుగుతోంది. కోట్లాది రూపాయలు విలువ చేసే రాఫెల్ జెట్స్‌కు సంబంధించి భారత్ పారిశ్రామిక భాగస్వాముల ఎంపికలో తమ ప్రమేయం ఉండదని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసిందని. భారత్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోస్ హోలాండ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ వివాదం ముదురుతుండడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఫ్రెంచి కంపెనీలకు భారత్‌లో తన భాగస్వాములను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. రాఫెల్‌ను తయారు చేసే డాసల్ట్ ఏవియేషన్ తన భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ ఉండాలని నిర్ణయించింది. ఈ వివరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం, దాసల్ట్ సంస్థలు వేరువేరుగా చేసిన ప్రకటనల్లో స్పష్టం చేశాయి. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన ప్రకటనపై ఫ్రెంచి మీడియా ప్రచురించిన కథనాలకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం, దాసల్ట్ సంస్థలు వివరణ ఇచ్చాయి. రాఫెల్స్ కొనుగోళ్లలో భారత్ భాగస్వామిని ఆ దేశ ప్రభుత్వమే సూచించిందంటూ హోలాండ్ చెప్పినట్లు ఫ్రెంచి మీడియా కథనాలు ప్రచురించాయి. ఈ ప్రాజెక్టు ఖరీదు రూ.58వేల కోట్లు. దాసల్ట్ సంస్థ భారత్‌కు సంబంధించి ఏ సంస్థను ఎంపిక చేసిందనే విషయమై తమ ప్రమేయం ఉండదని భారత్ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. 2015 ఏప్రిల్ 10వ తేదీన అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో మన ప్రధాని నరేంద్రమోదీ చర్చలు జరిపి ఒప్పందం ఖరారు చేశారు. మొదటి విడతగా 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లపై ఒప్పందం కుదిరింది. హోలాండ్ తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో భారత ప్రభుత్వమే ఏ సర్వీసు గ్రూపును ఎంపిక చేసుకోవాలో ప్రతిపాదించింది. దాసల్ట్ సంస్థ అంబానీతో మంతనాలు జరిపిందని పేర్కొన్నారు. కాగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ కూడా ఈ విషయమై ప్రకటన చేసింది. భారత్ లేదా ఫ్రాన్స్ ప్రభుత్వానికి వాణిజ్య పారిశ్రామిక సంస్థను ఎంపిక చేసుకోవడంలో ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. కాగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన ప్రకటనపై జాతీయ స్థాయిలో విపక్షాలు మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌కు లాభం చేకూర్చే విధంగా కేంద్రం వ్యవహరించిందన్నారు. ఈ సంస్థకు ఏరోస్పేస్ రంగంలో అనుభవం లేదని విపక్షాలు ధ్వజమెత్తాయి.

చిత్రం..ఏఐసీసీ కార్యాలయం వద్ద రాఫెల్ విమానం నమూనతో నిరసన వ్యక్తం చేస్తున్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ సభ్యుడు