జాతీయ వార్తలు

నిరాధార ఆరోపణలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రేలీ, సెప్టెంబర్ 22: ఆరోపణలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలని, నిరాధార ఆరోపణలు చేయొద్దని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇష్టానుసారం మాట్లాడడం సరైందికాదని రాజ్‌నాథ్ అన్నారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఇంటర్‌వ్యూపై అక్కడి మీడియా రాసిన కథనాలను భుజాన వేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ కంపెనీ పేరును భారత్ ప్రధాని మోదీనే సూచించారని హోలాండ్ వెల్లడించారు. ప్రధాని చెప్పారు కాబట్టి ఒప్పందంపై తాము మారు మాడ్లాడలేదన్న మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలు కలకలం రేపాయి.4ఈ వ్యవహారంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దాన్లో ఏముందో పరిశీలించుకోవచ్చు. లోతుగా పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి2అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. సహకార సంఘాల సమావేశానికి హాజరైన హోమ్‌మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ 3కాంగ్రెస్ అధ్యక్షుడు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది2అని అన్నారు. ఎవరి మీదనైనా ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆయన తెలిపారు. రాఫెల్ ఒప్పందంలోకి ప్రధాని నరేంద్ర మోదీ పేరును అనవసరంగ లాగుతున్నారని రాహుల్‌పై ఆయన విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే భారత్‌ను అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా సహకార రంగరం పునరుజ్జీవం కోసం కేంద్రం కృషి చేస్తోందని హోమ్‌మంత్రి చెప్పారు. 2022నాటికి అందరికీ గృహాలు నిర్మించాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వ ముందుకెళ్తోందని ఆయన తెలిపారు. ఇళ్లు నిర్మించి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇవ్వాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్టల్రో సహకార వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని దేశంలోని మిగితా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. ఏబీ వాజపేయి ప్రధానిగా ఉండగానే వ్యవసాయ వడ్డీ రుణాలు తగ్గించినట్టు ఆయన గుర్తుచేశారు. ఈ సమయంలో తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నానని రాజ్‌నాథ్ అన్నారు.