జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు రైతులంటే ప్రేమలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంజ్గీర్ (చత్తీస్‌గఢ్), సెప్టెంబర్ 22: కాంగ్రెస్ పార్టీకి రైతులంటే ప్రేమలేదని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉన్నా రైతాంగ సంక్షేమానికి ఏమీ చేయలేకపోయారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. సుపరిపాలన, సుస్థిరపాలన అందించే పార్టీని ప్రజలు ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ హయాంలో చత్తీస్‌గఢ్ శీఘ్రంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన రైతుల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. పేదల సంక్షేమం, ప్రగతి తప్ప మరోధ్యాస బీజేపీకి లేదన్నారు. చత్తీస్‌గఢ్ అంటే ఒకప్పుడు అడవులు, గిరిజనులు, ఉగ్రవాదం, తీవ్రవాదం చిరునామాగా ఉండేదన్నారు. దారి తప్పిన యువత మావోయిస్టు పార్టీలో చేరి తీవ్రవాదులుగా మారి హింసకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదం విసిరిన సవాళ్లను ధీటుగా ఎదుర్కొని అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని మళ్లించిందన్నారు. మా విధానాలు, ఉద్దేశ్యాలు స్పష్టంగా ఉన్నాయని, అభివృద్ధి తప్ప మరో అజెండా బీజేపీకి లేవన్నారు. రాయ్‌పూర్ లేదా ఢిల్లీ ఎక్కడైనా మా విధానాల్లో గందరగోళం ఉండదని, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు. గతంలో కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రాల్లో అభివృద్ధికి సరిగా వినియోగించేవారు కారన్నారు. కాని ఈ రోజు రాష్ట్రాలు పారదర్శకతతో అభివృద్ధికి అంకితమై పని చేస్తున్నాయన్నారు. సంక్షేమానికి కేటాయించే ప్రతి రూపాయిలో 15పైసలే లబ్ధిదారులకు చేరుతోందని, మిగతా సొమ్ము అవినీతిపరుల జేబుల్లోకిపోతోందని గతంలో మాజీ ప్రధాని ఒకరు చెప్పారన్నారు. తమ ప్రభుత్వం ఈ విధానాలకు చెక్ పెట్టిందన్నారు. చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి సాధ్యమని దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆకాంక్షని, ఇందుకు ఫలితంగా ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, జార్ఖాండ్ రాష్ట్రాలు అవతరించాయన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా చత్తీస్‌గఢ్ ఉండి ఉంటే, ఈ అభివృద్ధి జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా చిన్న రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత్వం ఎక్కువనుకునే భ్రమలను చత్తీస్‌గఢ్ పటాపంచలు చేసిందన్నారు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత రమణ్ సింగ్‌కు దక్కిందన్నారు. రైతాంగ సంక్షేమం కోసం కేంద్రం చేపట్టిన వివిధ పథకాలను ఆయన వివరించారు. 2022 నాటికి వ్యవసాయం లాభసాటిగా ఆవిష్కరించే విధంగా ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రూ.3వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. బిలాస్‌పూర్-అనుప్పూర్ మూడవ రైల్వే లైనును రూ.1697 కోట్లతో చేపడుతారన్నారు. ఈ రైల్వే ట్రాక్ పొడువు 152 కి.మీ అని, ఇందులో 115.55 కి.మీ చత్తీస్‌గఢ్ పరిధిలో ఉంటుందని, మిగిలిన 34.45 కి.మీ మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుందని ఆయన చెప్పారు.

చిత్రం..ప్రధాని మోదీని పూలమాలతో సత్కరిస్తున్న నాయకులు