జాతీయ వార్తలు

రక్షణకు రెండంచెల దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్ (ఒడిశా): భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమయింది. ఆదివారం రాత్రి ఒడిశా తీరం నుంచి ఇంటర్‌సెప్టర్ మిసైల్ ప్రయోగ పరీక్ష విజయవంతమయింది. రెండు అంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో దేశం కీలక మైలురాయిని అధిగమించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ఇంటర్‌సెప్టర్‌ను ప్రయోగించారు. భూవాతావరణానికి ఆవల 50 కి.మీ. ఎత్తులో నిర్దేశించిన లక్ష్యాలను ఢీకొని విచ్ఛిన్నం చేసేలా ఈ పృథ్వి డిఫెన్స్ వెహికల్ (పీడీవీ)ని ఏర్పాటు చేసినట్టు డీఆర్‌డీఓ శాస్తవ్రేత్త ఒకరు తెలిపారు.
పీడీవీ ఇంటర్‌సెప్టర్‌ను, అది ఛేదించాల్సిన లక్ష్యిత క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. రాడార్, ట్రాకింగ్ వ్యవస్థ ఆధారంగా తొలుత ప్రయోగించిన శత్రు క్షిపణిని గమన పథం కంప్యూటర్ నెట్‌వర్క్‌కు చేరింది. అప్పటికే సిద్ధంగా ఉన్న పీడీవీ ఇంటర్‌సెప్టర్ కంప్యూటర్ వ్యవస్థ నుంచి అందిన ఆదేశంతో రంగంలోకి దిగి శత్రు క్షిపణిని నిర్దేశిత స్థానంలో ఢీకొని, విజయవంతంగా అడ్డగించింది.