జాతీయ వార్తలు

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాబితాలపై ఆడిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరామ్‌లలో ఎన్నికల జాబితా, ఈవీఎంలు తదితర కార్యక్రమాలలో క్రమబద్ధీకరణమైన ఆడిట్ నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) నిర్ణయించింది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న ఈ నాలుగు రాష్ట్రాలలో ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌లు, ఈవీఎంలు ఉంచే స్థలాల వివరాలు తదితర అంశాలపై క్రమబద్ధీకరమైన పూర్తి ఆడిట్‌ను నిర్వహించాలని ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు ఇసిఐ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బూత్‌స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలను కూడా ఆడిట్ టీమ్ నిర్వహిస్తుందన్నారు. ఈ ఆడిట్ టీమ్‌ల పర్యటన వివరాలను త్వరలోనే పంపుతామని తెలిపింది. ఈ ఆడిట్ బృందాలు ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితాలను పరిశీలిస్తాయి. ఇసిఐ నిబంధనల మేరకు ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా లేదా చూస్తాయి. ఈ ఆడిట్ బృందాలు అడిగే సమాచారాన్ని వెంటనే అందించేలా ముఖ్య ఎన్నికల అధికారి తమ కింద అధికారులను అప్రమత్తం చేయాలని ఇసిఐ ఆదేశించింది.
ఇలావుండగా తమ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా ఇంకా తయారుకానందున ఆడిట్ బృందం పర్యటనను తమ రాష్ట్రంలో వాయిదా వేసుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి విఎల్ కాంతారావు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, ఇసిఐ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడిట్ బృందాన్ని పంపించాలని భోపాల్‌కు చెందిన అవినీతి నిరోధక సంఘం సభ్యుడు అజయ్ దుబే డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇదే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్న వివరాల్లో బయటపడ్డాయని ఆయన చెప్పారు. ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి సమగ్ర పరిశీలన జరపాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అలా జరిగితేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని, అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.