జాతీయ వార్తలు

రష్యాతో కలిసి గగన్‌యాన్‌కు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్ రష్యాతో కలిసి ప్రతిష్టాత్మక ఇస్రో ఆధ్వర్యంలో గగన్‌యాన్ ప్రాజెక్టును చేపట్టే ఒప్పందాన్ని ఖరారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్నారు. మానవ సహిత అంతరిక్ష ఉపగ్రహ యాత్ర గగన్‌యాన్‌ను నిర్వహించాలని భారత్ ప్రణాళికను రూపొందించింది. రష్యాతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. గగన్‌యాన్‌తో పాటు గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల రష్యాలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా గగన్‌యాన్ ప్రాజెక్టు చర్చకు వచ్చింది. మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టును చేపట్టే విషయమై ఇప్పటికే ఫ్రాన్స్‌తో భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ప్రకారం 2022 నాటికి ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపుతారు. 1984లో తొలిసారిగా రాకేష్ శర్మ అప్పటి సోవియట్ రష్యా నుంచి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి రష్యా, భారత్‌ల మధ్య 2015 మే నెలలో ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత్ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఫ్రాన్స్, రష్యా, అమెరికాతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. రష్యా నుంచి భారత్‌కు చెందిన తొలి శాటిలైట్ ఆర్యభట్‌ను ప్రయోగించారు. ఈ శాటిలైట్‌ను ప్రయోగం చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. గ్లోనాస్ నేవిగేషన్, శాటిలైట్ ప్రయోగాలు, అంతరిక్ష పరిశోధనలపై రష్యాతో భారత్ 2007లో కూడా కొన్ని ఒప్పందాలను ఖరారు చేసింది.