జాతీయ వార్తలు

డయల్ 112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ఇక అత్యవసర సర్వీసులకు దేశవ్యాప్తంగా ఒకే నెంబర్.. అదే 112. పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, ఇతర ఎమర్జెన్సీ సేవలను వినియోగించుకోవడానికి ఇప్పటి వరకూ 100, 101, 102, 108 నెంబర్లను డయల్ చేస్తూ వచ్చాం. ఇక నుంచి కేవలం ‘112’ డయల్ చేస్తే చాలు. అమెరికాలో ఇలాంటి అత్యవసర సర్వీసులకు అమలులో ఉన్న 911 తరహాలోనే భారత ప్రభుత్వం 112 నెంబర్‌ను అమలులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను అంతర్ మంత్రిత్వ ప్యానల్, టెలికాం కమిషన్ అమోదించింది. ఎక్కువ నెంబర్లు ఉండటం వల్ల తలెత్తే గందరగోళ పరిస్థితిని తొలగించేందుకే ఈ సింగిల్ నెంబర్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు 112కు డయల్ చేస్తే..వారి అవసరాలకు తగ్గట్టుగా సంబంధిత విభాగానికి అనుసంధానం చేస్తారు. తక్షణ సహాయం అందేలా చూస్తారు. ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా కూడా ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది.