జాతీయ వార్తలు

ఆరెస్సెస్‌తో టచ్‌లో ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయి మేనేజర్లకు 24 మార్గదర్శకాలతో ఒక ప్రణాళికను బీజేపీ ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రతి బూత్ మేనేజర్ తన పరిధిలో ఆరెస్సెస్ కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉండాలని పేర్కొంది. అలాగే తమ పరిధిలో మఠాలు, పీఠాలు, దేవాలయాలు, ఆశ్రమాలు, అందులోని ప్రధాన వ్యక్తులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలని బీజేపీ ఆదేశించింది. దీని వల్ల ప్రజా సంబంధాలు పటిష్టమవుతాయని బీజేపీ పేర్కొంది. దేశంలోని బూత్ స్థాయి మేనేజర్లు 24 సూత్రాలను పాటించాలని పార్టీ ఆదేశించింది. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు ఈ మార్గదర్శకాల పత్రులను అంద చేశారు. ఆరెస్సెస్ మాత్రం బీజేపీ పార్టీ తమను ఏ విషయమై సంప్రదింపులు జరపదని, పార్టీ రాజకీయ అజెండాతో తమకు సంబంధం లేదని పదే పదే స్పష్టం చేయడం గమనార్హం. ఈ విషయాన్ని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా సార్లు పేర్కొన్నారు. బీజేపీకి ఎన్నికల వ్యూహంపై, ఎత్తుగడలపై ఆరెస్సెస్ ఎప్పుడూ సలహా కూడా ఇవ్వదని ఆయన చెప్పారు. కాని బీజేపీ మాత్రం పార్టీ కేడర్ తప్పనిసరిగా ఆరెస్సెస్ నేతలతో టచ్‌లో ఉండాలని కోరింది. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఢిల్లీలో మూడు రోజుల పాటు సంస్థాగత సమావేశాల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాజకీయాలతో తమకు సంబంధం ఉండదని, దేశానికి ఏది మంచో గుర్తించి ఆ అంశాన్ని మాత్రం బహిరంగంగా చెబుతామని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో తయారైన అజెండాను బీజేపీ అమలు చేస్తుందనుకోవడం తప్పని ఆయన అన్నారు. ప్రతి పార్టీలో బూత్ మేనేజిమెంట్ ప్రాధాన్యత కలిగిన అంశం. బూత్ స్థాయిలోనే పార్టీ గెలుపు ఓటములు ఉంటాయి. అందుకే ఈ విభాగాన్ని పటిష్టం చేసేందుకు ఎన్నికల ఎత్తుగడలో భాగంగా పాపులారిటీ ఉన్న వ్యక్తులను కలవాలని బీజేపీ హైకమాండ్ బూత్ మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.