జాతీయ వార్తలు

మరింతగా రక్షణ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రక్షణ, భద్రతపరమైన అంశాలపై మరింత సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఈజిప్టు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఉగ్రవాద నిరోధక చర్యల విషయంలోను కలిసికట్టుగా పనిచేయాలని, అదే విధంగా సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించాలని సంకల్పించినట్లు అధికార వర్గాలు ఆదివారం నాడిక్కడ వెల్లడించాయి. కైరోలో భారత రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, ఈజిప్టు రక్షణ మంత్రి మహ్మద్ అహ్మద్ జకీల మధ్య చర్చల్లో ఈ మేరకు అవగాహన కుదిరించదని ఈ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 20, 22తేదీల మధ్య రెండు రోజులపాటు సీతారామన్ ఈజిప్టులో పర్యటించిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య నౌకదళ సహకారాన్ని కూడా పెంపొందించుకోవాలన్న అంశంపై వీరిమధ్య చర్చ జరిగిందని తెలిపాయి.