జాతీయ వార్తలు

రిలయన్స్‌కు ఉప్పందించింది మోదీనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రహస్యాలను పరిరక్షిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లకు సంబంధించి 36 ఫ్లైట్లను కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ డిఫెన్స్‌కు సమాచారం అందించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద శర్మ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ బదులివ్వాలని ఆయన కోరారు. ఈ ఆరోపణలపై మంత్రులు బదులిచ్చే బాధ్యతలను అప్పగించరాదన్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో రహస్యాలను పరిరక్షిస్తానని చేసిన ప్రమాణానికి తూట్లు పొడిచారన్నారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను ఒప్పందంలో భాగస్వామిని చేయమని రిలయన్స్‌కు సమాచారం అందించారని ఆయన అన్నారు. దాసల్ట్ సంస్థతో వెళ్లి మాట్లాడుకుని ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని మోదీనే రిలయన్స్ సంస్థకు సూచించారన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హేలాండ్ బహిరంగంగా ప్రధాని మోదీ తప్పిదాన్ని వెల్లడిస్తే ఇంకా ఈ విషయమై దాగుడుమూతలు ఎందుకని ఆయన నిలదీశారు. మన రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి చెప్పే అంశాల్లో నిజాలు లేవన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి మాట్లాడాలని ఆయన కోరారు. రిలయన్స్ సంస్థ ఈ అభియోగాలను తిరస్కరించిందని చెప్పగా, ముందు ప్రధాని ఈ విషయమై స్పష్టత ఇవ్వాలన్నారు. భారత్ ప్రతిష్టను మంటగలిపే విధంగా ప్రధాని మోదీ వ్యవహారశైలి ఉందన్నారు.