జాతీయ వార్తలు

హోలాండ్ మాట మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఫ్రాన్స్ ఆయుధ సంస్థ దస్సాల్ట్ భారత దేశంలో రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థను ఎంచుకోవటం వెనక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హస్తం ఉన్నదంటూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. జైట్లీ ఆదివారం తన బ్లాగ్‌లో రాఫెల్ యుద్ధ విమానాల వివాదం గురించి రాస్తూ భారత ప్రభుత్వం వత్తిడి మేరకే దస్సాల్ట్ సంస్థ రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థను ఎంచుకున్నదంటూ మొదట చేసిన ప్రకటనను ఆ తరువాత మార్చుకున్నారని తెలిపారు. హోలాండ్ పరస్పర విరుద్ధ ప్రకటనల ద్వారా తనను తాను ఖండించుకున్నారని జైట్లీ తెలిపారు. భారతదేశంలో దస్సాల్ట్‌తో కలిసి రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థ మినహా మరోమార్గం లేకుండా చేశారంటూ మొదట ఆరోపించిన హోలాండ్ మరోచోట ఇదే అంశంపై మాట్లాడుతూ రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థను ఎందుకు ఎంచుకున్నారనేది దస్సాల్ట్ సంస్థ అధికారులు చెప్పాలి తప్ప తానెల చెప్పగలనని వ్యాఖ్యానించటం పరస్పర విరుద్ధం కాదా? నిజానికి రెండు రూపాలు ఉండవు కదా? అని జైట్లీ వివరించారు. నిజం ఒక్కటే ఉంటుంది.. రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసేందుకు దస్సాల్ట్ సంస్థ రిలయన్స్‌ను ఎంచుకున్నది.. ఇందులో కేంద్ర ప్రభుత్వ హస్తం ఎంతమాత్రం లేదని ఆయన ప్రకటించారు. దస్సాల్ట్ భారతదేశంలో తమ స్థానిక భాగస్వామిగా అనీల్ అంబానీని ఎంచుకోవటంలో భారత ప్రభుత్వం లేదా ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని జైట్లీ స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అరుణ్ జైట్లీ ఈ వివరణ ఇవ్వటం గమనార్హం. హోలాండ్ మొదట చేసిన ప్రకటన ఆధారంగా మోదీపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా జైట్లీ విమర్శించారు. దస్సాల్ట్ భాగస్వామ్యం సంపాదించేందుకు అనిల్ అంబానీ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌కు ముడుపులు చెల్లించారంటూ మొదట ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అందుకు విరుద్ధ ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉన్నదని జైట్లీ చెప్పారు.