జాతీయ వార్తలు

సులభతర జీవన సూచీ తెలంగాణకు నాలుగో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సులభతర జీవన సూచీ-2018లో తెలంగాణకు నాలుగో స్థానం లభించగా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరి అమృత్ పథకంలో భాగంగా ఈజ్ ఆప్ లివింగ్ ఇండెక్-2018 విడుదల చేశారు. ఈ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్థానంలో నిలవగా తర్వాత స్థానాల్లో వరుసగా ఒడిశా, మధ్యప్రదేశ్ నిలిచినట్టు పూరి వెల్లడించారు. సులభతర జీవన సూచీ ర్యాంకుల ఇచ్చే విషయంలో ఆయా పట్టణాలకు ఉన్న అవకాశాలు, వౌలిక సాదుపాయల కల్పన, మంచినీటి సరఫరా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. అమృత్ పథకం కింద సాధిస్తున్న ఫలితాలు సుస్థిర పట్టణాభివృద్ధి అంశంలో భారత్ పెట్టుకున్న లక్ష్యాల సాధన దిశగా సాగుతున్న విషయాన్ని రుజువు చేస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పథకం కింద గత నెల చివరివరకు దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో 24 లక్షల ఇళ్లకు తాగునీటి సౌకర్య కల్పించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2018 ఆగస్టు నెలలో దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను విడుదల చేశామని, అందులో 111 నగరాలకు స్థానం కల్పించినట్టు చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్ 65.24 శాతం మార్కులతో నంబర్ వన్‌గా నిలవగా, 59.17 శాతంతో ఒడిశా, 54.32 శాతంతో మధ్యప్రదేశ్ వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించుకున్నాయి. నాలుగో స్థానంలో నిలిచిన తెలంగాణ 52.39 శాతం మార్కులను సొంతం చేసుకుంది.