జాతీయ వార్తలు

ఇక కట్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 24: రాజకీయ ప్రయోజనాలను ఆశించే రాఫెల్‌పై కాంగ్రెస్ రాద్ధాంత చేస్తోందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలాండ్ వివరణ ఇచ్చినా కాంగ్రెస్ అదేపనిగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. హోలాండ్ వివరణతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ పనిగట్టుకుని ‘రాఫెల్’ను రాజకీయం చేస్తోందని సోమవారం ఇక్కడ విరుచుకుపడ్డారు.‘ ప్రభుత్వాన్ని ఎత్తిచూపడానికి ప్రతిపక్షానికి ఏమీ కనిపించడం లేదు. రాఫెల్ ఒప్పందాన్ని సాకుగా చూపించి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటోంది’అని ఆయన అన్నారు. సెంట్రల్ జోన్ సమావేశం తరువాత రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ ‘రాఫెల్ డీల్‌పై హోలాండ్ సవివరంగా చెప్పారు. అయినా ప్రతిపక్ష పార్టీ అదే పనిగా కేంద్రంపై విమర్శలు చేస్తోంది’అని అన్నారు. కేంద్రం ప్రభుత్వం రిలయన్స్‌ను సూచించిందని, దీంతో తమకు మరో చాయిస్ కనిపించలేదని తొలుత హోలాండ్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. తరువాత మొత్తం ఒప్పందపై ఆయన వివరణ ఇచ్చారు. కాశ్మీర్ సమస్యపై ఎవరితోనైనా చర్చలకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ ప్రకటించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని పాకిస్తానేనని ఆయన విమర్శించారు.‘జమ్మూకాశ్మీర్ సమస్యపై ఎవరితోనైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భద్రతాదళాలు సమష్టిగా, సమన్వయంతోనే పనిచేస్తున్నాయి’అని హోమ్‌మంత్రి స్పష్టం చేశారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదుల్లో కాశ్మీర్ లోయలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రెండ్రోజల క్రితం ఉగ్రవాదులు తెగబడి ముగ్గురు పోలీసులను హత్యచేసిన అంశం సెంట్రల్ జోన్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ‘22 అంశాల్లో 20 పరిష్కారమయ్యాయి. సమస్యల పరిష్కారానికి గత నాలుగేళ్లుగా కృషి చేస్తునే ఉన్నాం. 12 సార్లు సమావేశమై 680 అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. 428 సమస్యలకు పరిష్కారం కనుగొన్నాం’అని ఆయన వెల్లడించారు. రహదారుల నిర్మాణం, ఆధునీకరణ, వౌలిక సదుపాయల కల్పనతోపాటు అనేక కీలక అంశాలపై చర్చించి, ఆమోదం తెలిపామని ఆయన అన్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు పోలీసు దళాలను ఆధునీకరించాలని నిర్ణయించారు. సమాఖ్య వ్యవస్థ పటిష్టం చేస్తూ కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని రాజ్‌నాథ్ వెల్లడించారు. యూపీ, ఉత్తరాఖండ్ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, త్రివేంద్ర సింగ్ రావత్ సమావేశానికి హాజరయ్యారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు.

చిత్రం..సెంట్రల్‌జోన్ కౌన్సిల్ సమావేశంలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్