జాతీయ వార్తలు

లక్షకు ఇద్దరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశంలో పది లక్షల మంది జనాభాకు 19 మంది న్యాయమూర్తులే ఉన్నారని న్యాయ మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కింది కోర్టులను కలుపుకుని 6000 మంది న్యాయమూర్తుల పోస్టుల ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కింది కోర్టుల్లోనే కేవలం 5000 మంది జడ్జిలను నియమించాల్సి ఉంది. జడ్జిల ఖాళీలకు సంబంధించి గత మార్చిలో కేంద్ర న్యాయశాఖ ఓ నివేదిక రూపొందించింది. దానిపై పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. జడ్జి-జనాభా నిష్పత్తి 19.49గా ఉన్నారు. అంటే పది లక్షల జనాభాకు 19 మంది న్యాయమూర్తులున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రాల సబార్డినేట్ కోర్టుల్లో 5748 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 24 హైకోర్టుల్లో 460 న్యాయమూర్తులను నియమించాల్సి ఉంది. సుప్రీం కోర్టు, హైకోర్టులు, కింది కోర్టులు అన్నింటినీ కలుపుకొంటే 6160 మంది జడ్జిల అవసరం ఉంది. కోర్టుల్లో సరిపడ న్యాయమూర్తులు లేక పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని ప్రధాని సమక్షంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ రెండేళ్ల క్రితం వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ఈ భారాన్ని తగ్గించాలని చీఫ్ జస్టిస్ కోరారు. పది లక్షల మంది జనాభాకు కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలని లా కమిషన్ సిఫార్సు ఎప్పుడో సిఫార్సు చేసింది. కాగా న్యాయాధికారుల పోస్టుల భర్తీ వేగవంతం చేయాలని 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోరారు. న్యాయమూర్తుల కొరత వల్లే కింద కోర్టుల్లోనూ కేసులు పేరుకుపోతున్నాయని అన్నారు. న్యాయాధికారుల నియమాకానికి సంబంధించి పరీక్షలు, ఇంటర్‌వ్యూలు సకాలంలో చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈమేరకు ఆగస్టు 14న ఆయన లేఖ రాశారు. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 2,76,74,499 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.