జాతీయ వార్తలు

సామాన్యుడు సైతం విమానం ఎక్కాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్‌యాంగ్ (సిక్కిం), సెప్టెంబర్ 24: దేశంలో సామాన్యుడు సైతం విమానాల్లో ప్రయాణించాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు ఇక్కడ ఉద్ఘాటించారు. హవాయి చెప్పులు వేసుకునేవారు సైతం విమానాల్లో విహరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ సిక్కింలో మొట్టమొదటి విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతాన్ని భారత వృద్ధికి శోధక యంత్రంగా మార్చాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే ఈశాన్య భారతంలో అభివృద్ధి మందకొడిగా సాగిందని విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంటే 2014 వరకు దేశంలో కేవలం 65 విమానాశ్రయాలే ఉండేవని, గత నాలుగు సంవత్సరాల్లో వీటి సంఖ్య వందకు పెరిగిందని, తమ ప్రభుత్వమే 35 విమానాశ్రయాలను నిర్మించిందని తెలిపారు. గతంలో సగటున ఏడాదికి ఒకే విమానాశ్రయం వచ్చేదని, ఇప్పుడది తొమ్మిదికి పెరిగిందని తెలిపారు. అలాగే గత 70 సంవత్సరాల్లో భారతదేశంలో 400 విమానాలే ఉండేవని, కానీ ఒక్క ఏడాదిలోనే 1000 కొత్త విమానాలను వివిధ విమానయాన సంస్థలు ఆర్డర్ చేశాయని అన్నారు. ఈశాన్య భారతాన్ని విమాన, రహదారి మార్గాల్లో అనుసంధానం చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు సైతం విద్యుత్‌ను అందిస్తున్నామని, వౌలిక సదుపాయలను కల్పిస్తున్నామని మోదీ చెప్పారు. ప్రధాని హోదాలో తాను అనేకసార్లు ఈ రాష్ట్రానికి వచ్చానని, పలువురు కేంద్ర మంత్రులు పర్యటించారని తెలిపారు.

చిత్రం..సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని సోమవారం
జాతికి అంకితం చేసిన సందర్భంగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ