జాతీయ వార్తలు

పోరాటానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: రాఫెల్ డీల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేకెత్తిస్తున్న నేపథ్యంలో ‘ఇవి వారి వారి అభిప్రాయాలకు, భావనలకు సంబంధించిన అంశం’ అని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ అంశంపై విపక్షాలతో దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతున్నామరి సోమవారం నాడు ఇక్కడ వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి రాఫెల్‌పై వాస్తవాలను వెల్లడిస్తామని ఆమె చెప్పారు.
ఇది అంతర్జాతీయ కుట్ర
రాఫెల్‌పై బీజేపీ ఎదురుదాడి
రాఫెల్ డీల్ వ్యవహారం మరో మలుపుతిరిగింది. ఈ అంశంపై అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అలాగే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ పాత్రదారులని బీజేపీ ఆరోపించింది. తన బావ రాబర్ట్‌వాద్రాకు సంబంధమున్న ఒక కంపెనీకి మేలు చేసే ఉద్దేశ్యంతోనే రాఫెల్ ఒప్పందాన్ని రద్దు చేసుకునేలా రాహుల్‌గాంధీ ప్రతికూల ప్రచారానికి దిగారని బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ అన్నారు. వాద్రాకు సంబంధించిన కంపెనీని బ్రోకర్‌గా తీసుకోకపోవడం వల్లే రాఫెల్ డీల్‌ను అప్పటి యూపీఏ సర్కార్ రద్దు చేసుకుందని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో షెకావత్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని, ఆ దేశ మాజీ హోంమంత్రి రహెమాన్ మాలిక్ చేసిన ట్వీట్ ఇందుకు నిదర్శనమని షెకావత్ అన్నారు.