జాతీయ వార్తలు

మూడు రాష్ట్రాల్లో హస్తానిదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో బీజేపీకి భంగపాటు తప్పదా? అంటే తప్పదనే వెల్లడిస్తున్నాయి ఒపీనియన్ పోల్స్. వసుంధర రాజే నేతృత్వంలోని రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వానికి ఈసారి భారీ ఓటమి ఖాయమని, రెండు దశాబ్దాల బీజేపీ హవాకి ఇక తెరపడినట్టేనని చెబుతున్నాయి ఈ ఒపీనియన్ పోల్స్. ఏబీపీ న్యూస్-సి ఓటర్, సి ఫోర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఇంచుమించు 50 శాతం ఓట్ల శాతం పొందుతుందని, 142, 124-138 సీట్లను దక్కించుకుంటుందని వెల్లడించాయి. 200 మంది సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధర రాజే తిరిగి సీఎం స్థానానికి బీజేపీ నుంచి పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. సి ఫోర్ కేవలం రాజస్థాన్‌లోనే ఈ సర్వే నిర్వహించగా, ఏబీపీ న్యూస్ మాత్రం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సైతం ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం అంచున నిలబడుతుందని, కేవలం రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నందున ఎన్నికల లోపు ఏర్పడిన పరిస్థితుల వల్ల ఏ పార్టీకి మద్దతుగా అయినా అనుకూల పవనాలు వీచవచ్చునని అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లలో కాంగ్రెస్‌కు 122, ఛత్తీస్‌గఢ్‌లోని 90 సీట్లలో 47 సీట్లను ఆ పార్టీ గెల్చుకుంటుందని అంచనా వేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ 108, 40 సీట్లను మాత్రమే దక్కించుకుంటుందని పేర్కొంది.
అలాగే రాజస్థాన్‌లో సీఎం అభ్యర్థిగా సచిన్‌పైలట్‌కు 36 శాతం మంది మద్దతు తెలపగా, వసుంధర రాజేకు 27 శాతం మంది ఓటేసినట్టు ఏబీపీ న్యూస్-సి ఓటర్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ 24 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. సి ఫోర్ నిర్వహించిన సర్వే ప్రకారం సీఎం అభ్యర్థిత్వానికి సచిన్‌పైలట్, గెహ్లాట్, వసంధర్ రాజేలకు వరుసగా 32, 27, 23 శాతం ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్‌లలో రమణ్‌సింగ్‌లకే ఓటరు తమ ప్రథమ ప్రాధాన్యత కల్పించారు. ఏబిపీ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 42.2, బీజేపీకి 41.5, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 38.9, బీజేపీకి 38.2 శాతం ఓట్లు పోలవుతాయని పేర్కొంది. కాగా రాజస్థాన్‌లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓటర్ శాతం అంతరాయం ఎక్కువగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 49.9 శాతం రాగా, బీజేపీకి 34.3 శాతం మాత్రమే వచ్చాయి. అలాగే సి ఫోర్ ప్రకారం రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 50, బీజేపీకి 43 శాతం ఓట్లు వచ్చాయి.
2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 165, కాంగ్రెస్‌కు 58, రాజస్థాన్‌లో బీజేపీకి 142, కాంగ్రెస్‌కు 21, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 49, కాంగ్రెస్‌కు 39 సీట్లు వచ్చాయి. తమ సేంపుల్ సర్వేలో భాగంగా సి ఫోర్ రాజస్థాన్‌లో 5,788 మంది ఓటర్లను, ఏబిపీ మూడు రాష్ట్రాలలో 26,196 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించాయి. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు నవంబర్ 12, 20న, మధ్యప్రదేశ్, మిజోరామ్‌లలో నవంబర్ 28న, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు డిసెంబర్ ఏడున ఎన్నికలు జరుగుతాయి. అయితే మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ మాత్రం డిసెంబర్ 11న జరుగుతుంది.