జాతీయ వార్తలు

మహా కూటమితోనే ఎన్‌డీఏకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఓడించాలంటే కాంగ్రెస్ హైకమాండ్ తన అహంభావాన్ని కొద్దిగా తగ్గించుకుని మిత్రపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయటం మంచిదని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సలహా ఇచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని, ఉత్తిపుణ్యానికి అధికారాన్ని కోల్పోతారని ఆదివారం ఇక్కడ మీడియాతో అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం మొండివైఖరి వల్లే మహాకూటమి ఏర్పాటు కావడం లేదని సిన్హా అభిప్రాయపడ్డారు. 5 రాష్ట్రాల శాసన సభల ఎన్నికలతోపాటు ఆ తరువాత వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయకతప్పదని యశ్వంత్ గట్టిగా చెప్పారు. ‘కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏ ఒక్కటే నరేంద్ర మోదీని ఓడించలేదు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసికూడా దానికి విరుద్ధంగా వ్యవహరించటం వెనకఉన్న అర్థం ఏమిటని కాంగ్రెస్‌ను ఆయన నిలదీశారు. రాజకీయాల్లో అహంకారం, మొండితనం ఎంత మాత్రం మంచిది కాదనేది కాంగ్రెస్ నాయకులకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకుని బీఎస్పీ, ఎస్‌పీ తదితర పార్టీలతో పొత్తుల చర్చలు ప్రారంభించాలని ఆయన హితవు చెప్పారు. కాంగ్రెస్ నాయకుల వైఖరి మూలంగానే మహాకూటమి ఏర్పడటం లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

చిత్రం..కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా