జాతీయ వార్తలు

దేని దారి దానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)తో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘రాష్ట్రాల స్థాయిలో చర్చలు విఫలమైనంత మాత్రాన లోక్‌సభ పొత్తులపై ఎలాంటి ప్రభావం ఉండదు. మహాకూటమిపై ఏ మాత్రం ప్రభావం చూపదు’అని కాంగ్రెస్ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వివరించారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలన్నదానిపై ఆయా రాష్ట్రాల పార్టీ విభాగాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపుపై బీఎస్పీ-కాంగ్రెస్ మధ్య ప్రతిష్టంభన నెలకొంది. కాగా నవంబర్ 12, డిసెంబర్ 7 మధ్య జరగనున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని ఖైరా అభివర్ణించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు.‘ రాష్ట్ర స్థాయిలో పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి హైకమాండ్ ఆమోదం ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. ఒకటి రెండు రాష్ట్రాల్లో పొత్తులు కుదరనంత మాత్రాన మహాకూటమితో ముడిపెట్టి చూడకూడదని ఆయన తెలిపారు. దీనిపై ఎలాంటి గందరగోళానికి ఆస్కారం లేదని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపాలన్న లక్ష్యంతో మహాకూటమికి కాంగ్రెస్ ఓ పక్క ప్రయత్నాలు చేస్తుండగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల చేసిన ప్రకటన అయోమయానికి గురి చేసింది.