జాతీయ వార్తలు

కాంగ్రెస్ కంచుకోటపై బీజేపీ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 7: కాంగ్రెస్ కంచుకోటగా భావించే యూపీలోని రాయ్‌బరేలి నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రతిష్టను తగ్గించడానికి బీజేపీ కొత్త ఎత్తుగడ వేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖులు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ చాలా ప్రాంతాలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నందున అదే రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులను ఆ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించనున్నారు. ఈ చర్యతో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిష్టను తగ్గించాలని వ్యూహం పన్నింది. అరుణ్‌జైట్లీ ప్రతినిధి, యూపీ బీజేపీ అధికార ప్రతినిధి, బాలీవుడ్ హీరో అయిన బాజ్‌పాయి నెల క్రితమే ఈ విషయాన్ని వెల్లడించారు.
తన ఎంపీ నిధులను అరుణ్‌జైట్లీ రాయబరేలి జిల్లాలోని పలు ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తారని ఆయన చెప్పారు. ఎంపీల్యాడ్స్ కింద ప్రతి ఎంపీకి ఏడాదికి ఐదు కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రతి ఎంపీ తాను ఎన్నికైన రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల అభివృద్ధి పనులకు ఆ నిధులను కేటాయించవచ్చు. ఈ నేపథ్యంలోనే అరుణ్‌జైట్లీ పలు సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్న రాయ్‌బరేలి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి ఈ నిధులను కేటాయిస్తారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి జైట్లీ ఈ నిధులను కేటాయిస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ జైట్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరని, ఈ నియోజకవర్గంలో బీజేపీని పటిష్టం చేయడానికే ఈ చర్య చేపడుతున్నారని స్పష్టం చేశారు. కాగా, తమకు ఒక స్టేడియం, యూనివర్సిటీ నిర్మించాలని, సోలార్ లైట్లు, సోలార్ ఎనర్జీతో నడిచే పంపులు మంజూరు చేయాలని చాలాకాలంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారన్నారు. అలాగే చాలాకాలంగా అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. కాగా ఎంపీ ల్యాడ్స్ నిధులకు సంబంధించి ఇప్పటికే 2.5 కోట్లు రాయబరేలి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు అభివృద్ధి పనుల నిమిత్తం చేరాయన్నారు. కాగా ప్రస్తుతం రాయ్‌బరేలి నియోజకవర్గానికి సోనియా గాంధీ, సమీపంలోని అమేధికి ఆమె కుమారుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం 1980లో రాయ్‌బరేలిలో విజయం సాధించారు. ఆమె పెద్దకుమారుడు రాజీవ్‌గాంధీ అమేథి నుంచి 1984, 89, 91లలో, ఆమె చిన్నకుమారుడు సంజయ్ గాంధీ అమేథి నుంచి 1980లో విజయం సాధించారు.