జాతీయ వార్తలు

ఆంక్షల భయం లేనేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత్ రక్షణ రంగంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. రష్యాతో ఎస్-400 ట్రింఫ్ మిసైళ్ల కొనుగోళ్ల ఒప్పందం నేపథ్యంలో అమెరికా ఆంక్షలు విధిస్తుందన్న భయాలను ఆయన కొట్టిపారేశారు. ఇటువంటి ఆందోళనల వల్ల ప్రయోజనం లేదన్నారు. మాస్కో నుంచి కామోవ్ హెలికాప్టర్లు, ఇతర అత్యంత ఆధునిక సాంకేతిక రక్షణ పరికరాలను కొనుగోలు చేయాలనే యోచనతో ఉన్నట్లు ఆయన చెప్పారు. అమెరికా ప్రయోజనాల హాని కలిగించే విధానాలపై చర్యలు తీసుకునే చట్టం కింద (క్యాట్సా) అమెరికా భారత్‌పై ఆంక్షల విధిస్తుందనే ఆందోళన పెరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. రష్యాలో ఆరు రోజుల పర్యటన ముగించుకుని స్వదేశానికివచ్చిన రావత్ మాట్లాడారు. భారత్ రక్షణ వ్యవస్థతో కలిసి పనిచేయాలని రష్యా భావిస్తోందన్నారు. మన ఆర్మీ బలమైనదనే విషయం రష్యాకు తెలుసన్నారు. వ్యూహాత్మకంగా భారత్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్న రష్యా నుంచి ఆధునిక రక్షణ పరికరాలు తెప్పించుకోవడం వల్ల మన వ్యవస్థ బలపడుతుందన్నారు. ఆదివారం ఇక్కడ జనరల్ కేవీ కృష్ణారావు స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికా ఆంక్షలు విధిస్తుందని ఆలోచించడం కంటే, రక్షణ వ్యవస్ధలో స్వతంత్రంగా ఎదగాలని భావించాలన్నారు. అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై అభద్రతా భావం అక్కర్లేదని తాను రష్యాకు సూచించినట్లు రావత్ చెప్పారు. మన అంతరిక్ష, గగనతల వ్యవస్థను బలోపేతం చేసే ఆధునిక పరికరాలపై భారత్ దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. మన దేశ ప్రయోజనాలు, వ్యూహాత్మకంగా మనకు ఉపయోగపడే దేశాలతో చెలిమి అవసరమని ఆయన చెప్పారు.