జాతీయ వార్తలు

పెట్టుబడులకు స్వర్గ్ధామం భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా భారత్ అవతరించిందని, సామాజిక, ఆర్థిక రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల వృద్ధిరేటు ఊపందుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన మొదటి ఇనె్వస్టర్ల సదస్సు 2018ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో దేశంలోని అన్ని రంగాల్లో సంస్కరణలు పుంజుకున్నాయన్నారు. భారత్ ప్రగతిని చూసి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడీదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. దేశంలో ద్రవ్యలోటు గణనీయంగా తగ్గుతోందన్నారు. ఆర్థిక రంగంలో మధ్యతరగతి వర్గాలు భాగస్వామ్యమవుతున్నాయన్నారు. ద్రవ్యోల్బణం రేటు కూడా తగ్గిందన్నారు. మధ్యతరగతి వర్గం అభివృద్ధిలో పాలుపంచుకోవడం వల్ల అభివృద్ధి ఊపందుకుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగిందన్నారు. ఈ రోజు సులభ వాణిజ్య విధానాల అమలులో భారత్ క్రమేపి అగ్రస్థానం వైపు కదులుతోందన్నారు. వస్తుసేవా పన్ను సంస్కరలతో వాణిజ్య రంగంలో కొత్త శకం ప్రారంభమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో పన్నుల రంగంలో జీఎస్‌టీ అతి పెద్ద సంస్కరణ అన్నారు. దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు వస్తున్నాయన్నారు. టైర్-2, టైర్-3 నగరాలకు కూడా ఎయిర్ కనెక్టివిటీ కల్పిస్తున్నట్లు చెప్పారు. అందరికీ ఇల్లు, అందరికీ విద్యుత్ లాంటి పథకాలను వేగవంతంగా అమలు చేస్తున్నామన్నారు. దేశంలో తొలిసారిగా ఉచిత వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు ఆయుష్మాన్‌భారత్ యోజన స్కీంను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్థి చెందుతున్న రాష్టమ్రన్నారు. పెద్ద ఎత్తున సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందన్నారు. ప్రభుత్వం ఆవిష్కరించిన కొత్తపర్యాటక విధానాన్ని ప్రపంచదేశాలను ఆకట్టుకుంటోందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పెట్టుబడులకు అనేక దేశాలు ఆసక్తికనపరుస్తున్నాయన్నారు. ఈ రాష్ట్రంలో సహజ ప్రకృతి వనరుల వల్ల అభివృద్ధికి మంచి అవకాశం ఉందన్నారు. ఉత్తరాఖండ్ దేవ భూమి అని ఇక్కడకు యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారన్నారు. ఆధ్యాత్మిక పర్యావరణ జోన్‌గా తీర్చిదిద్దాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్భ్రావృద్ధికి ఏ మోడల్ అనుసరిస్తారని విలేఖర్లు అడిగారన్నారు. తాను దక్షిణ కొరియా మోడల్ అని చెప్పానన్నారు. దీనికి విలేఖర్లు విస్తుబోయారన్నారు. దక్షిణ కొరియా జనాభా, భౌగోళిక ప్రాంతం, గుజరాత్‌కు సారూప్యత ఉందన్నారు. తాను ఎంపిక చేసుకున్న మార్గంలో ప్రయాణం చేసి ప్రణాళికను అమలుచేసి సత్ఫలితాలుసాధించానన్నారు. పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని ఆయన చెప్పారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించి, వెంట వెంటనే ఉత్పత్తిని ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..డెహ్రడూన్‌లో ఇనె్వస్టర్ల సదస్సు సందర్భంగా ఓ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ