జాతీయ వార్తలు

సహకరించిన వారికి అందలం.. లొంగని వారికి బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం వ్యవహారంలో సహకరించిన అధికారులకు మోదీ ప్రభుత్వం లబ్ధి చేకుర్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ- ఫ్రాన్స్ అధ్యక్షుడితో 2015లో ప్రధాని మోదీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ముందు రక్షణ శాఖలో ఎలాంటి పరిశీలన జరగలేదని చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొలుగోలుకు ఒప్పందం కుదిరిన తర్వాతనే రక్షణ శాఖ పరిశీలనకు పంపించారని ఆయన వెల్లడించారు. అప్పట్లో రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ వర్మ ఈ ఒప్పందలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారని జైపాల్‌రెడ్డి చెప్పారు. అప్పుడు డైరెక్టర్ జనరల్‌గా అశారామ్ షిహగ్ ఉన్నారని, ఆయన నిప్పులాంటి వ్యక్తి కావడంతో ఆయన్ని తొలగించి స్మితా నాగ్‌రాజ్‌ను తెరమీదకు తీసుకొచ్చి డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించిందని చెప్పారు. ఆమె అదనపు సెక్రటరీ హోదాలో జాయింట్ సెక్రటరీ రాజీవ్ వర్మ అభ్యంతరాలను తొలిపుచ్చారని జైపాల్ వెల్లడించారు. స్మితా నాగ్‌రాజ్ అదనపు సెక్రటరీ హోదాలో ప్రధాని మోదీకి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రతిఫలంగా ఆమెను యూపీఎస్సీ సభ్యురాలుగా నియమించి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఎప్పుడూ కార్యదర్శి హోదాలో ఉన్నావారు మాత్రమే యూపీఎస్సీ సభ్యులు అవుతారని.. కాని స్మితా నాగ్‌రాజ్ అదనపు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారని వెల్లడించారు. యూపీఎస్సీ సభ్యురాలిగా ఐదేళ్లు అదనంగా స్మితా నాగ్‌రాజ్‌కు సర్వీసు కల్పించారని వివరించారు. కేంద్రం చేసిన ఈ ఒప్పందం అమలు చేసుకునేందుకు కొందరు అధికారులకు మేలు చేకుర్చారని.. మరి కొందరు అధికారులు బెందిరింపులకు గురయ్యారని జైపాల్ ఆరోపించారు. ఈ వ్యవహరంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. గతంలో అనేక విమానాలు తయారీ చేయడంతో పాటు, సర్వీసును అందించిన అనుభవం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. సుమారు పదివేల ఉద్యోగాలు కల్పించిన సామర్ధ్యం ఆ సంస్థకు ఉందని అన్నారు. హెచ్‌ఏఎల్ సంస్థకు లేని సామర్ధ్యం అనిల్ అంబాని కంపెనీకి ఉందా అని జైపార్ రెడ్డి ప్రశ్నించారు.
చిత్రం..ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జైపాల్‌రెడ్డి