జాతీయ వార్తలు

ఒక్క సినిమా ఇండస్ట్రీనే నిందించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 15: గతంలో లైంగిక వేధింపులకు గురైన మహిళలను ‘మీటూ’ ఉద్యమం పేరుతో బయటకు వస్తున్న నేపథ్యంలో విలక్షణ నటుడు కమల్‌హసన్ తనదైన రీతిలో స్పందించారు. ఈ విషయంలో కేవలం సినిమా రంగానే్న తప్పుపట్టడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు వెలుగుచూసినప్పుడు ఇరువర్గాల వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన లైంగిక వేధింపులన్నది అన్ని రంగాల్లోనూ ఉన్నాయన్న విషయాన్ని మరచిపోకూడదని చెప్పారు. సోమవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన కమల్ మహిళలు చేస్తున్న ఆరోపణలు విస్మరించడానికి వీల్లేదని వాటిని సహేతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బాధిత మహిళలు బయటకు వస్తున్నారు కాబట్టి భవిష్యత్‌లో ఏ రకమైన వేధింపులూ ఉండవన్న అభిప్రాయం కలుగుతోందని కమల్ తెలిపారు.