జాతీయ వార్తలు

నేతాజీ జీవించి ఉన్నారా? లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉన్నారా? లేదా? అన్నదానిపై స్పష్టం చేయాలని నేషనల్ ఆర్కివ్స్ ఆఫ్ ఇండియాను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. నేతాజీ బోస్‌కు సంబంధించిన సమాచారం కోరుతూ ఆర్‌టీఐ కార్యకర్త అవ్‌దేశ్ కుమార్ చతుర్వేది సీఐసీని ఆశ్రయించారు. అవ్‌దేశ్ దరఖాస్తును పరిశీలించిన సీఐసీ ఎన్‌ఏఐ(పురాతన పత్రాలు భద్రతపరిచే సంస్థ)ను వివరాలు అందించాలని కోరింది. బోసు జీవించి ఉన్నారా? లేక చనిపోయా? తెలపాలనంటూ ఆర్‌టీఐ కార్యకర్త కోరారు. 2015, 2016లో నేతాజీ జయంతి అంటూ ప్రధాని మోదీ నివాళులు అర్పించారని అవ్‌దేశ్ పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై అనేక అనుమానాలున్నాయని ఆయన చెప్పారు. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించినా స్పష్టమైన సమాచారం లభించలేదని, అందుకే ఆర్‌టీఐ ద్వారా సీఐసీకి దరఖాస్తు చేసినట్టు కార్యకర్త వెల్లడించారు. పీఎంఓ నుంచి నేతాజీ బోస్ ఉన్నారా? లేదా అన్న దానిపై సరైన సమాధానం రాలేదని అవ్‌దేశ్ చెప్పారు. పైగా ఇది తమ పరిధిలోనిది కాదని, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు సంబంధించిందంటూ దరఖాస్తును అక్కడికి పంపినట్టు ఆర్‌టీఐ కార్యకర్త తెలిపారు. ‘బోస్‌కు సంబంధించిన పత్రాలు, వివరాలన్నీ ఆర్కివ్స్ విభాగం వద్ద ఉంటాయి. దాన్ని సంప్రదించాల్సిందిగా పీఎంఓవో చెప్పింది’అని ఆయన వివరించారు. కాగా ఆర్‌టీఐ కార్యకర్తలకు 15 రోజుల్లో వివరాలన్నీ వర్గీకరించి అందజేయాలని సీఐసీ చీఫ్ కమిషనర్ ఆర్కే మాధూర్ ఎన్‌ఏఐను ఆదేశించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఆజాద్ హింద్ ఫోజ్)ను 1942లో బోస్ స్థాపించారు. జపాన్ సైన్యం మద్దతుతో బ్రిటీష్ పాలకులపై పోరాడేందుకు ఆయనీ సైన్యాన్ని స్థాపించారు. ఏటా జనవరి 23న బోస్ జయంతిని నిర్వహిస్తారు.