జాతీయ వార్తలు

చేష్టలుడిగిన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: తెలుగుదేశం పార్టీ అవినీతి సొమ్ముతో 23 మంది వైఎస్సాఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదాయపన్ను శాఖ తనిఖీల నుంచి తప్పించుకునేందుకే బీజేపీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ రాజకీయాలను ఒక వ్యాపారంలా మార్చేసిందని, రాజకీయ పదవుల్లో ఉండి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఎవరిపైనా కక్ష సాధింపులు జరపడం లేదని ఆ యన స్పష్టం చేశారు. దేశంలో 2016-17 ఏడాదిలో 1152, 2017-18 ఇప్పటివరకు 600 ఆదాయపన్ను తనిఖీలు జరిగాయని గుర్తుచేశారు. ఎలాం టి ప్రగల్భాలు పలకకుండా టీడీపీ నాయకులు ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జీవీఎల్ సూచించారు.
సిద్దూను మంత్రివర్గం నుంచి తప్పించాలి
పంజాబ్ మంత్రి, మాజీ భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ దక్షిణ భారతదేశాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యాలపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఒక క్రికెటర్‌గా దేశం మొత్తం సిద్దూను అభిమానిస్తుంది.. కానీ పాకిస్తాన్ మద్దతుదారుడిగా కాదని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. భారతదేశ భిన్నత్వంలోని ఏకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవించదా? అని ఆయన ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఎంపీ స్థానాలు గెలవడంవల్లే చాలాసార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతీయులను అవమానించిందని, ముఖ్యంగా ఆ పార్టీ నాయకులనే గాంధీ కుటుంబం అవమానాలకు గురిచేసిందని ఆరోపించారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని, ఆయన భౌతికకాయా న్ని సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదని చెప్పారు. పీవీ నరసింహారావు చనిపోయిన తరువాత అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ భావించగా, సోనియాగాంధీ మాత్రం అనుమతించలేదని ఆరోపించారు. పీవీ నరసింహారావు దక్షిణ భారతీయు డు, తెలంగాణవారు కావడంతోనే సోనియాగాంధీ ఆయనపై వివక్ష చూపించారని ధ్వజమెత్తారు. దక్షిణాది ప్రజలను అవమానించిన సిద్దూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దూని వెంటనే పంజాబ్ మం్ర తివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దక్షిణాది రాష్ట్రాలలో సిద్దూ రాజకీయ ప్రచారాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ‘దక్షిణ భారత్‌లోని ప్రాంతాలకు వెళితే ఎక్కువ కాలం ఉండలేను.. నాకు అక్కడి భాష అర్థం కాదు, వారి వంటలు తినలేను.. ఇడ్లీ మాత్రమే తినగలుగుతా.. వారి అలవా ట్లు, సంస్కృతి వేరు.. కానీ నేను పాకిస్థాన్ వెళ్తే అక్కడి ప్రజలు పంజాబీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. అందుకే నాకు దక్షిణ భారత్ వెళ్లడం కంటే పాకిస్థాన్ వెళ్లడమే ఎక్కువ ఇష్టమని’ ఒక కార్యక్రమంలో పంజాబ్ మంత్రి సిద్దూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.