జాతీయ వార్తలు

సర్వత్రా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 16:శమరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును నిరసిస్తూ గత పది రోజులుగా ఉద్యమాలు చెలరేగుతున్న నేపథ్యంలో బుధవారం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. సుప్రీం తీర్పు తర్వాత ఆలయ ద్వారాలు తెరుచుకోవడం ఇదే మొదటిసారి కావడంతో నిరసనల స్థాయి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని, మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటామంటూ ఇప్పటికే నిరసనకారులు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పరిస్థితిని చల్లబరిచి ఏకాభిప్రాయం సాధించేందుకు ట్రావన్‌కోర్ దేవసం బోర్డు మంగళవారం చేసిన చివరి ప్రయత్నం విఫలం కావడంతో బుధవారం పరిస్థితి ఏమిటన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అంశంపై చర్చించేందుకు బోర్డు నిరాకరించడంతో ఈ సమావేశం నుంచి పండలం రాజకుటుంబ సభ్యులు, సంబంధిత ఇతర వర్గాలు వాకౌట్ చేశాయి. ఇదిలా ఉండగా అయ్యప్ప ఆలయం వైపు మహిళలు ఎవరు వెళ్ళకుండా నిరోధించేందుకు వందలాదిమంది అయ్యప్ప మహిళా భక్తులు పికిటింగ్ నిర్వహించారు. స్వామి శరణం అయ్యప్ప అంటూ నినాదాలు చేస్తున్న ఆ మహిళలు నిషిద్ధవయస్సు కలిగిన యువతులు ఎవరూ ఆలయం వైపు వెళ్ళకుండా ఉండేందుకు అన్ని ప్రైవేటు వాహనాలను, బస్సులను తనిఖీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయ దర్శనానికి వస్తున్న ఈ వయస్సు యువతులను బలవంతంగా వెనక్కి పంపించివేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బుధవారంనాడు ఆలయ ద్వారాలు తెరిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 10 నుంచి 50సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలను ఎవరిని నీలక్కల్ ప్రాంతం దాటి వెళ్ళనిచ్చేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. శబరిమలకు ఇదే ముఖద్వారం కావటంతో అక్కడే నిరసనకారులు బైఠాయించారు. ఇప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు తమకేమీ పట్టనట్టుగా ఈ పరిణామాలను చూస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులను అడ్డుకొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ హెచ్చరించారు. ఆలయ దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తామని, ఎవరు చట్టాన్ని తమ చేతిల్లోకి తీసుకున్నా వదిలేదని తెలిపారు. శబరిమల పేరుతో హింసకు పాల్పడ్డాన్ని సహించేది లేదని వెల్లడించారు. కాగా, నీలక్కల్ ప్రాంతాన్ని దాదాపుగా అయ్యప్ప భక్తులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టుగా సమాచారం. సుప్రీంకోర్టు ఎలా చెబితే అలాగే తాము నడుచుకుంటామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ఈ విషయంలో పునరాలోచన ప్రసక్తే లేదన్నారు.

చిత్రం..శబరిమలకు వెళ్లేదారిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు