జాతీయ వార్తలు

గెలుపు మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, అక్టోబర్ 16: రాజస్తాన్ బీజేపీ నాయకత్వంలో ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వసుంధర రాజే పట్ల పూర్తి మద్దతు వ్యక్తమవుతోందని, పార్టీలోని అన్ని వర్గాలు ఆమె నాయకత్వాన్ని బలంగా సమర్థిస్తున్నాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ అన్నారు. రానున్న అసెంబ్మీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి తిరుగులేదని ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షకశక్తి, జీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాజకీయ వ్యూహాత్మకత తమ పార్టీకి కచ్చితంగా విజయాన్ని కట్టబెడతాయని జవడేకర్ అన్నారు. డిసెంబర్ 7న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ నాయకత్వం అహరహం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నాయకత్వంలో విభేదాలు తలెత్తాయంటూ మీడియా కథనాలు వెల్లువెత్తడంతో పార్టీ నాయకత్వం అప్రమత్తమయింది. పార్టీ వర్గాల్లో సమన్వయలోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని, ఇప్పుడంతా సవ్యంగా మారిందని జవడేకర్ తెలిపారు. మొత్తం రాష్ట్ర పార్టీ విభాగం బీజేపీ విజయం కోసం బలంగా పనిచేస్తోందని, ముఖ్యంగా వసుంధర రాజన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి సర్వశక్తులు ధారబోస్తుందని జవడేకర్ అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే పట్ల విభేదాలు తలెత్తాయని, అందుకే వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడం లేదంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్‌పైలెట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో బీజేపీ ఇన్‌చార్జ్ జవడేకర్ స్పందించారు. కాంగ్రెస్‌తో పోలిస్తే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీకే ఎక్కువ బలం ఉందని స్పష్టంచేసిన జవడేకర్ ‘‘ అన్ని వర్గాలకు ఆమోద యోగ్యమైన వ్యక్తినే మేం నిలబెట్టాం. ఈ విషయంలో మా మధ్య ఎలాంటి తేడాలు లేవు. కానీ కాంగ్రెస్ నాయకత్వమే విభేదాల మయంగా ఉంది. అశోక్ గెహలెట్, సచిన్ పైలెట్ శిబిరాల మధ్య కుమ్ములాటలు సాగుతున్నాయి’’అని జవడేకర్ అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూనే వస్తోందని, కానీ కాంగ్రెస్ పార్టీ బలం మాత్రం నానాటికీ క్షీణించిపోతోందని జవడేకర్ అన్నారు. నరేంద్ర మోదీ, అమిత్‌షాల నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతోందని స్పష్టం చేసిన జవడేకర్ ఎప్పటికప్పుడూ ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ రావడం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం వ్యతిరేకత అన్నదే లేదన్నారు. వసుంధర రాజే పాలన రాష్ట్రానికి స్వర్ణయుగం అని 2013లో మొదలైన ఆమె పాలనలో రాజస్తాన్ అభివృద్ధి పరంగా కొత్త పుంతలు తొక్కిందని జవడేకర్ తెలిపారు. వౌలిక సదుపాయాల కల్పనతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వసుంధర రాజే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కచ్చితంగా మళ్లీ అధికారంలోకి తేగలవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రాజస్తాన్ అంటే నీటి కొరతకు పెట్టింది పేరని, కానీ తమ ప్రభుత్వం అన్ని గ్రామాలకు నీటిని అందించిందని, పంట పొలాలకు సాగునీటిని సమకూర్చిందని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయ దుందుభి మోగించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు.